స్కీముకి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవి? ఈ డాక్యుమెంట్లు ఏ సమాచారాన్ని అందిస్తాయి?

స్కీముకి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవి? ఈ డాక్యుమెంట్లు ఏ సమాచారాన్ని అందిస్తాయి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

అన్ని మ్యూచువల్‌ ఫండ్ ప్రకటనలు సందేశాన్ని కలిగి ఉంటాయి: “అన్ని స్కీము సంబంధించి డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.” ఈ డాక్యుమెంట్లు ఏమిటి?

3 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి: కీలక సమాచార మెమొరాండం (కెఐఎమ్), స్కీము సమాచార డాక్యుమెంట్ (ఎస్ఐడి) మరియు స్టేట్ ఆఫ్ అడిషనల్ ఇన్‌ఫర్మేషన్ (ఎస్ఎఐ).

ఇవి నిర్దిష్ట స్కీము గురించి అసెట్ మేనేజిమెంట్ కంపెనీ (ఎఎమ్‌సి) ద్వారా తయారు చేయబడతాయి మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ) కి ఆమోదం కొరకు సబ్మిట్ చేయబడతాయి.

ఎస్ఐడి సమాచారం ఇలా ఉంటుంది:

  1. పెట్టుబడి ఉద్దేశ్యం మరియు విధానాలు, అసెట్ కేటాయింపు పద్ధతి, ఫీజు మరియు లిక్విడిటీ ప్రొవిజన్స్ లాంటి అన్ని ప్రాథమిక గుణాలు.
  2. ఫండ్ మేనేజిమెంట్ టీమ్ వివరాలు
  3. స్కీములో అన్ని రిస్కు కారకాలతొ బాటు రిస్కు తగ్గించే విధానాలు.
  4. లోడ్, ప్లాన్స్ మరియు ఎంపికలు, గత పనితీరు, బెంచ్‌మార్క్ లాంటి స్కీము వివరాలు.
  5. జనరల్ యూనిట్ హోల్డర్ సమాచారం.
  6. ఎఎమ్‌సి బ్రాంచిల జాబితా, ఇన్వెస్టర్‌ సర్వీస్ సెంటర్స్, అఫీషియల్ పాయింట్స్ ఆఫ్ ఆక్సెప్టెన్స్ లాంటి ఇతర వివరాలు.

 

ఎస్ఎఐ ఇలాంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది:

  1. మ్యూచువల్‌ ఫండ్ రాజ్యాంగం – ప్రాయోజితులు, అసెట్ మేనేజిమెంట్ కంపెనీ మరియు ట్రస్టీలు.
  2. ఎఎమ్‌సి మరియు అసోసియేట్లు అయినటువంటి, రిజిస్ట్రార్లు, కస్టోడియన్లు, బ్యాంకర్లు, ఆడిటర్లు మరియు లీగల్ కౌన్సెల్ ముఖ్య సిబ్బంది సమాచారం అంతా.
  3. అన్ని ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యలు.

ఎస్ఐడి సంక్షిప్త పాఠాంతరం కెఐఎమ్;, దరఖాస్తు ఫారంతో జతపరచబడినది. పేరు సూచించినట్లు, ఇందులో స్కీములో పెట్టుబడి పెట్టడానికి ముందు ఇన్వెస్టర్‌ తప్పక తెలుసుకోవలసిన ముఖ్య సమాచారం ఉంటుంది. కెఐఎమ్ ప్రతి దరఖాస్తు పత్రంతో తప్పక అందుబాటులో ఉంచాలి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను