స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

స్మాల్-క్యాప్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు, ఇవి మొత్తం ఆస్తులలో కనీసం 65% స్మాల్ క్యాప్ కంపెనీల ఈక్విటీ మరియు ఈక్విటీ-సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. స్మాల్ క్యాప్ కంపెనీలు సాధారణంగా రూ.100 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంటాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 250 కంపెనీలకు వెలుపల ఉంటాయి, అయినప్పటికీ వాటి నిర్వచనం మార్కెట్ మధ్యవర్తుల మధ్య మారవచ్చు.

స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లక్షణాలు

  • అధిక వృద్ధి సామర్థ్యం ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి.
  • అంతర్లీన కంపెనీల ప్రారంభ అభివృద్ధి దశ కారణంగా అస్థిరంగా మరియు రిస్కీగా ఉంటాయి.
  • బుల్ మార్కెట్లో మిడ్, లార్జ్ క్యాప్ ఫండ్‌లను అధిగమించవచ్చు, బేర్ మార్కెట్లో మెరుగైన పనితీరును కనబరచకపోవచ్చు.
     

స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ؚలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

  • గణనీయమైన వృద్ధి సామర్థ్యం: బలమైన వృద్ధి మరియు వైవిధ్య అభివృద్ధి అవకాశాలు ఉన్న వ్యాపారాలలో పెట్టుబడులు పెడతాయి.
  • తక్కువ అంచనా వేసిన ఆస్తులు: తక్కువ అంచనా కారణంగా, చిన్న వ్యాపారాలలో తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టడం వల్ల అవి పెరిగేకొద్దీ దీర్ఘకాలిక రాబడిని పొందవచ్చు.
  • విలీనాలు మరియు కొనుగోళ్లు (M&A): చిన్న సంస్థలు గణనీయమైన M&A అవకాశాలను అందిస్తాయి, ఇవి పెద్ద కంపెనీలతో విలీనం కావడం వల్ల ప్రయోజనాలకు దారితీస్తాయి.
     

మీరు మీ పోర్ట్ؚఫోలియోను వైవిధ్యపరచాలనుకుంటే, అధిక రిస్క్ؚలను స్వీకరించాలనుకుంటే మరియు దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలను అన్వేషించాలనుకుంటే, స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మంచివి కావచ్చు. అయితే, పెట్టుబడి పెట్టే ముందు, మీ రిస్క్ ప్రొఫైల్, ఫండ్ ఇన్వెస్ట్మెంట్ విధానం మరియు చారిత్రక సమాచారాన్ని జాగ్రత్తగా అంచనా వేయండి మరియు పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారును సంప్రదించండి.

డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

284
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను