టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లు అంటే ఏమిటి?

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లు అంటే ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్ల గురించి పెరుగుతున్న అవగాహన మరియు గ్యారెంటీ పొదుపు ఉత్పత్తులపై పడిపోతున్న వడ్డీ రేట్లతో, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, PPFలు మరియు NSCలు లాంటి సాంప్రదాయ ఉత్పత్తులకు అలవాటు పడిన చాలా మంది రిస్క్ కోరుకోని పెట్టుబడిదారులు సముచితమైన కారణాల వల్ల డెట్ ఫండ్ల వైపు మళ్ళారు. అధిక ప్రజాదరణగల ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే, డెట్ ఫండ్లలో తక్కువ అస్థిరత ఉందని మరియు వారి ఫిక్స్డ్ డిపాజిట్లు, PPFలు మరియు NSCల కంటే మెరుగైన రాబడి ఇచ్చే సామర్థ్యంతో, వాటి కంటే ఇవి ఎక్కువ పన్ను ప్రయోజనం కలిగి ఉన్నాయని అలాంటి పెట్టుబడిదారులు తెలుసుకున్నారు. అయినప్పటికీ, పెట్టుబడిదారులు ఇప్పటికీ డిఫాల్ట్ రిస్క్కు, అంటే అసలు మరియు వడ్డీ చెల్లింపులను కోల్పోయే రిస్క్కు మరియు వడ్డీ రేటు రిస్క్కు, అంటే వడ్డీ రేట్లలో మార్పుల కారణంగా ధర హెచ్చుతగ్గులకు గురి అవుతున్నారు.

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లు (TMFలు) తమ పోర్ట్ఫోలియోను ఫండ్ మెచ్యూరిటీ తేదీతో సమన్వయపరచడం ద్వారా డెట్ ఫండ్లకు సంబంధించిన రిస్క్లను మెరుగ్గా నావిగేట్ చేయడంలో పెట్టుబడిదారులకు సహాయపడతాయి. ఇవి అంతర్గత బాండ్ ఇండెక్స్ను ట్రాక్ చేసే ప్యాసివ్ డెట్ ఫండ్లు. ఈవిధంగా, అటువంటి ఫండ్ల పోర్ట్ఫోలియోలో అంతర్గత బాండ్ ఇండెక్స్లో భాగమైన బాండ్లు ఉంటాయి మరియు ఈ బాండ్లకు ఫండ్ పేర్కొన్న మెచ్యూరిటీ చుట్టూ మెచ్యూరిటీలు ఉంటాయి. పోర్ట్ఫోలియోలోని బాండ్లు మెచ్యూరిటీ వరకు ఉంచబడతాయి మరియు హోల్డింగ్ వ్యవధిలో పొందిన అన్ని వడ్డీ చెల్లింపులను తిరిగి ఫండ్లో పెట్టుబడి పెట్టబడతాయి. ఆవిధంగా, టార్గెట్ మెచ్యూరిటీ బాండ్ ఫండ్లు FMPల లాంటి అక్రూవల్ (క్రమవృద్ధి) మోడ్లో పనిచేస్తాయి. అయినప్పటికీ, FMPల లాగా కాకుండా, TMFలకు ఓపెన్-ఎండెడ్ స్వభావం ఉంటుంది మరియు టార్గెట్ మెచ్యూరిటీ డెట్ ఇండెక్స్ ఫండ్లు లేదా టార్గెట్ మెచ్యూరిటీ బాండ్ ETFలుగా అందించబడతాయి. కాబట్టి, FMPలు TMFల కంటే ఎక్కువ లిక్విడిటీని ఇస్తాయి.

ఫండ్ పోర్ట్ఫోలియోలోని అన్ని బాండ్లు మెచ్యూరిటీ వరకు ఉంచబడతాయి మరియు ఫండ్ పేర్కొన్న మెచ్యూరిటీ సమయంలోనే అవి మెచ్యూర్ అవుతాయి కాబట్టి సమయవ్యవధికి సంబంధించినంత వరకు TMFలకు ఏకరూప పోర్ట్ఫోలియో ఉంటుంది. బాండ్లను మెచ్యూరిటీ వరకు ఉంచడం ద్వారా, ఫండ్ సమయవ్యవధి కాలక్రమేణా పడిపోతూ ఉంటుంది, అందువల్ల వడ్డీ రేటు మార్పుల కారణంగా ధరల హెచ్చుతగ్గులకు పెట్టుబడిదారులు గురయ్యే అవకాశం తక్కువ ఉంటుంది.

ప్రస్తుతం TMFలు ప్రభుత్వ సెక్యూరిటీలు, PSU బాండ్లు మరియు SDL (స్టేట్ డెవలప్మెంట్ లోన్లు) లలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి. కాబట్టి, ఇతర డెట్ ఫండ్లతో పోలిస్తే వీటికి తక్కువ డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. ఈ నిధులు ఓపెన్-ఎండెడ్ కాబట్టి, బాండ్ జారీదారుల చుట్టూ డిఫాల్ట్ లేదా క్రెడిట్ డౌన్గ్రేడ్ వంటి ఏవైనా ప్రతికూల అభివృద్ధి అవకాశంలో ఉన్న సందర్భంలో పెట్టుబడిదారు అతని/ఆమె పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు.

వాటికి ఓపెన్-ఎండెడ్ స్ట్రక్చర్ మరియు లిక్విడిటీకి హామీ ఉన్నప్పటికీ,  టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లను మెచ్యూరిటీ వరకు ఉంచడం మంచిది, ఎందుకంటే ఇది కొంత రాబడికి సంబంధించిన కొంత అంచనా అందజేస్తుంది, ఇదే సంప్రదాయ డిపాజిట్ల నుండి డెట్ ఫండ్లకు పెట్టుబడిదారులు మొదటిసారి మారడంలో ఉన్న ముఖ్యమైన అంశం.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను