అల్ట్రా-షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ తెలియచేయబడ్డాయి

అల్ట్రా-షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ తెలియచేయబడ్డాయి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

అల్ట్రా-షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ 3 నుండి 6 నెలల కాలపరిమితి కలిగిన స్వల్పకాలిక డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. మార్కెట్ రిస్క్ؚలకు లోబడి తక్కువ రిస్క్ విధానం కలిగిన లిక్విడ్ ఫండ్స్ కంటే ఇవి కొంత ఎక్కువ రాబడులను అందించవచ్చు. తక్కువ సమయంలో రాబడులను ఆర్జించడం, వడ్డీరేట్ల మార్పుల వల్ల మూలధన నష్టాల ప్రమాదాన్ని తగ్గించడం వీటి ప్రధాన లక్ష్యం. దీర్ఘ కాలిక బాండ్ లేదా ఈక్విటీ ఫండ్స్ؚతో పోలిస్తే, తక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అవి తక్కువ రిస్క్ؚ కలిగినవిగా పరిగణించబడతాయి.

అల్ట్రా-షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లక్షణాలు

1.    షార్ట్-టర్మ్ డెట్ సెక్యూరిటీస్ؚలో పెట్టుబడి పెట్టడం
అల్ట్రా-షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అనేవి స్వల్పకాలిక మ్యూచువల్ ఫండ్లు, ఇవి ప్రధానంగా వాణిజ్య పత్రాలు, డిపాజిట్ల సర్టిఫికేట్లు మరియు ఇతర మనీ మార్కెట్ సాధనాల వంటి డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి.

2.    అధిక లిక్విడిటీ
ఈ ఫండ్ؚలు స్వల్పకాలిక ఫండ్ నిర్వహణ కోసం సులభమైన ప్రవేశం మరియు నిష్క్రమణను అందిస్తాయి. అవి సాధారణంగా నిష్క్రమణ భారాన్ని కలిగి ఉండవు.

3.    మితమైన రాబడులు
అల్ట్రా-షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ తక్కువ-రిస్క్ ప్రొఫైల్ؚను నిర్వహించేటప్పుడు లిక్విడ్ ఫండ్స్ కంటే కొంత ఎక్కువ రాబడిని అందించడాన్ని లక్ష్యంగా కలిగి ఉంటాయి. ఇది తక్కువ రిస్క్, తక్కువ రాబడి ఉత్పత్తి.

అల్ట్రా షార్ట్-టర్మ్ డెట్ ఫండ్స్ స్వల్పకాలిక మిగులు నిధులను తాత్కాలికంగా ఉంచడానికి సరిపోతాయి.

డిస్క్లైమర్:
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

284
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను