అనియంత్రిత డిపాజిట్ స్కీమ్‌లు అంటే ఏవి?

అనియంత్రిత డిపాజిట్ స్కీమ్‌లు అంటే ఏవి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్కీముల కంటే  ఎక్కువగా డౌన్రిస్క్ లేకుండా అధిక రాబడి ఇస్తామని మోసపూరిత వాగ్దానం చేసే లేని పెట్టుబడి స్కీముల వలలోపడిన అమాయకుల ఉదాహరణలు కోకొల్లలు. అలాంటి అనియంత్రిత పెట్టుబడి స్కీములను పాంజీ స్కీములు అంటారు, వీటిలో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అనియంత్రిత డిపాజిట్ స్కీములు వ్యక్తులు, వ్యక్తుల సమూహాలు లేదా ఒక కంపెనీ వ్యాపార ఉద్దేశం కోసం నిర్వహించే డిపాజిట్ స్కీములు, ఇవి భారతదేశంలో అన్ని రకాల డిపాజిట్ స్కీములను పర్యవేక్షించడానికి బాధ్యత వహించే తొమ్మిది నియంత్రణా అథారిటీలు దేనిలో కూడా రిజిస్టర్‌కానివి. ఈ స్కీములు సాధారణంగా చాలా అధిక రాబడులను కొద్ది లేదా అసలు రిస్క్‌తో అందిస్తామని వాగ్దానం చేస్తాయి. 

అలాంటి అనియంత్రిత డిపాజిట్ స్కీముల్లోవేలాదిమంది తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్నారు, దీంతో ప్రభుత్రానికి అనియంత్రిత డిపాజిట్ స్కీముల నిషేధ చట్టం 2019 అమల్లోనికి తీసుకొని రావాల్సి వచ్చింది. ఈ చట్టం నియంత్రిత డిపాజిట్ స్కీమ్‌ల జాబితాను పేర్కొంటుంది మరియు ఇందులో సంప్రదాయక డిపాజిట్ స్కీములుగా పరిగణించబడని మ్యూచువల్ ఫండ్స్ మరియు ఫోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (PMS) లాంటివి కూడా ఉన్నాయి.

చాలా తక్కువ రిస్క్‌తో బాగా రాబడులు ఇస్తుందని అనిపించే పెట్టుబడి వికల్పం మీకు కనిపిస్తే, రిస్క్ మరియు రాబడి ఎప్పుడూ వెంటవెంట ఉంటాయని గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో ఉచిత భోజనం ఎక్కడా ఉండదు మరియు తక్కువ రాబడి ఇచ్చే ఆప్షన్‌తో  పోల్చితే అధిక రాబడి అంటే ఎల్లప్పుడూ అధిక రిస్క్ కూడా కలిగి ఉంటుంది. అనియంత్రిత డిపాజిట్ స్కీములు రిస్క్, రాబడి మధ్య ఉన్న అవినాభావ వర్తక సంబంధాన్ని అర్థం చేసుకోలేని చిన్న పెట్టుబడిదారులను మోసం చేయడాన్ని లక్ష్యం చేసుకుంటాయి. ఈ మోసపూరిత స్కీములు వీటిలో ఉన్న రిస్క్‌ను గురించి మాట్లాడకుండా ఆకర్షణీయమైన రాబడులతో పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారానే పూర్తిగా పనిచేస్తాయి.   

అనియంత్రిత పెట్టుబడులలో ఉన్న అతిపెద్ద రిస్క్ ఏమిటంటే వీటిలో రాబడికి గ్యారెంటీ ఉండదు,  స్కీము కింద వాగ్దానం చేసిన చెల్లింపులను ప్రమోటర్లు నెరవేర్చకపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్కీము లిస్ట్ చేయబడిన తొమ్మిది నియంత్రణా ఆథారిటీలు దేనిలోనూ రిజిస్టర్ చేయబడలేదు కాబట్టి, ఆ స్కీము మోసం అని తెలిసినప్పుడు మీ డబ్బును తిరిగి పొందడానికి మీరు వారిని సంప్రదించలేరు.

అనియంత్రిత డిపాజిట్ స్కీముల చట్టం 2019, అలాంటి డిపాజిట్లను తీసుకోవడాన్ని, డిపాజిటర్లకు వాగ్దానం చేసిన చెల్లింపులను చేయకపోవడాన్ని లేదా అలాంటి స్కీములను ప్రమోట్ చేయడాన్ని కూడా చట్టవ్యతిరేకమైనవిగా పరిగణిస్తుంది. అలాంటి నేరాలను శిక్షార్హమైనవిగా  చేయబడ్డాయి. మీకు మరెక్కడ పొందలేని ఎక్కువ రాబడిని వాగ్దానం చేసే మరియు రిస్క్‌తో కూడుకున్నవిగా అనిపించని, కొంత సమయంలోనే మీ డబ్బును రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసే లేదా ఏమీ కోల్పోకుండా మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తామని వాగ్దానం చేసే పెట్టుబడి స్కీములను గురించి మీరు మళ్లీ ఎప్పుడైనా వింటే, ఆ స్కీములను ఎవరు నిర్వహిస్తున్నారో, ఆ స్కీము ఇక్కడ చిత్రంలో పేర్కొనబడిన నియంత్రణ సంస్థలలో దేనిలోనైనా రిజిస్టర్ చేయబడిందా అని తనిఖీ చేయడానికి ప్రయత్నించండి మరియు ఆ స్కీముకు సంబంధించిన వార్తల కోసం శోధించండి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను