సి.ఎ.ఎస్. (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్) అంటే ఏమిటి

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

వేర్వేరు ఉపాధ్యాయులు బోధించిన వేర్వేరు సబ్జెక్టుల వ్యాప్తంగా ఒక విద్యా సంవత్సరంలో జరిపిన పలు పరీక్షలలో ఒక విద్యార్ధి యొక్క స్కోరును చూపే ఒక స్కూల్ రిపోర్ట్ కార్డు మాదిరిగానే, ఒక కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (సి.ఎ.ఎస్.) అనేది ఒక నెలలో వేర్వేరు మ్యూచువల్ ఫండ్‌ల వ్యాప్తంగా ఒక పెట్టుబడిదారు చేసిన అన్నీ ఆర్ధిక సంబంధిత లావాదేవీలను కలిగి ఉండే ఒక భౌతిక స్టేట్‌మెంట్. మీరు మూడు వేర్వేరు ఫండ్లలో పెట్టుబడి చేసి ఉంటే, కొనుగోలు, రిడీంషన్, మారడాలు, SIPలు/STPలు/SWPల, డివిడెంట్ చెల్లింపులు/డివిడెంట్లను తిరిగి పెట్టుబడి పెట్టడం వంటి అన్నీ ఆర్ధిక లావాదేవీలు క్యాప్చర్ చేయబడతాయి. 

ఒక పాన్‌కు అనుసంధానం చేయబడిన వివిధ పోర్ట్‌ఫోలియోల ఆరంభ మరియు ముగింపు బ్యాలెన్స్‌లను కూడా సి.ఎ.ఎస్. క్యాప్చర్ చేస్తుంది. బ్యాంకు వివరాలు, చిరునామా, నామినీ మొదలైనవాటిలో మార్పుల వంటి ఆర్ధికేతర లావాదేవీలు సి.ఎ.ఎస్.లో క్యాప్చర్ చేయబడవు. వేర్వేరు ఫండ్ హౌజ్‌ల వ్యాప్తంగా నెలవారీ ఆర్ధిక లావాదేవీలను క్యాప్చర్ చేయడమే కాకుండా డీమ్యాట్ మోడ్‌లో ఉంచిన ఇతర సెక్యూరిటీలలోని లావాదేవీలను కూడా ఒక సి.ఎ.ఎస్. క్యాప్చర్ చేస్తుంది. దీనర్ధం ఒక సి.ఎ.ఎస్.లో స్టాక్ సంబంధిత లావాదేవీలు సైతం క్యాప్చర్ చేయబడతాయి.

కాబట్టి, సి.ఎ.ఎస్. అనేది వాస్తవానికి మీ ఆర్ధిక పెట్టుబడి సంబంధిత లావాదేవీలు అన్నింటి యొక్క కన్సాలిడేటెడ్ స్టేట్‌మెంట్. సి.ఎ.ఎస్. అనేది నెల నెలా రూపొందించబడుతుంది, ఆపై వచ్చే నెల 10వ రోజు నాటికి పెట్టుబడిదారులకు మెయిల్ చేయబడుతుంది. ప్రత్యేకించి పాన్ కలిగి ఉన్న వారి కొరకు సి.ఎ.ఎస్.  రూపొందించబడుతుంది, తద్వారా సదరు పాన్‌తో ముడిపడి ఉన్న అన్నీ ఆర్ధిక సంబంధిత లావాదేవీలను అది క్యాప్చర్ చేస్తుంది. PAN ను కలిగిన సదరు వ్యక్తి ఒక నెలలో ఎటువంటి ఆర్ధిక సంబంధిత లావాదేవీలనూ జరపనట్లైతే, సి.ఎ.ఎస్. ఏదీ రూపొందించబడదు. 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను