మిడ్-క్యాప్ మరియు స్మాల్-క్యాప్ ఫండ్స్ మధ్య తేడా ఏమిటి?

మిడ్-క్యాప్ మరియు స్మాల్-క్యాప్ ఫండ్స్ మధ్య తేడా ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మిడ్-క్యాప్ మరియు స్మాల్-క్యాప్ రెండూ ఒకటేనా, వీటి మధ్య తేడా ఏమీ లేదా అని మీరు ఆలోచిస్తుంటే, అక్టోబరు 2017 లో జారీచేయబడి, జూన్ 2018 నుండి అమలులో ఉన్న సెబీ యొక్క ఉత్పత్తి వర్గీకరణ సర్క్యులర్ ఖచ్చితంగా మీరు చూడాలి. ఇవి మార్కెట్ సైజు ద్వారా నిర్వచించబడిన భిన్న రకాల కంపెనీలలో పెట్టుబడి పెట్టే రెండు భిన్న రకాల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, కాబట్టి భిన్నమైన రిస్క్-రిటర్న్ ప్రొఫైల్స్ను ప్రదర్శిస్తాయి.

భారతదేశంలో వివిధ ఎక్ఛేంజ్లలో బహిరంగంగా జాబితా చేయబడిన అనేక కంపెనీలు ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా (మార్కెట్ క్యాపిటలైజేషన్ = బహిరంగంగా జాబితా చేయబడిన షేర్ల సంఖ్య x ప్రతి షేర్ యొక్క ధర) 101వ నుండి 250వ కంపెనీని మిడ్-క్యాప్ సూచిస్తుంది, అదే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 251వ కంపెనీ నుండి స్మాల్ క్యాప్స్ అని పిలువబడతాయి.

అధిక పెరుగుదల సామర్థ్యం కలిగి ఉండి, ఇప్పటికే నిర్దిష్ట స్థాయి మరియు స్థిరత్వాన్ని ఈ కంపెనీలు సంపాదించాయి కాబట్టి  స్మాల్ క్యాప్స్కు సంబంధించిన రిస్క్ను ప్రదర్శించని మిడ్-క్యాప్ కంపెనీలలో, మిడ్-క్యాప్ ఫండ్ పెట్టుబడి పెడుతుంది. మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు మా ఆర్టికల్స్ ఒకదానిలో మరింత చదవవచ్చు:
mutualfundssahihai.com/te/what-are-mid-cap-funds

ప్రస్తుతం అధిక సంభావ్య పెరుగుదల దశ గుండా పయనిస్తున్నప్పటికీ అంతే రిస్క్ కలిగి ఉన్న స్మాల్-క్యాప్ కంపెనీలలో స్మాల్-క్యాప్ ఫండ్ పెట్టుబడి పెడుతుంది. ఎక్కువ స్థిరమైన లార్జ్-క్యాప్ స్టాక్స్ లాగా కాకుండా, స్మాల్-క్యాప్ స్టాక్స్ చాలా ఎక్కువ అస్థిరంగా ఉండగలవు.
కాబట్టి, స్మాల్-క్యాప్ ఫండ్ కేటగిరీలాగా మరీ ఎక్కువ రిస్క్ లేకుండా లార్జ్-క్యాప్స్ కంటే అధిక రాబడులు అందించే సామర్థ్యం మిడ్-క్యాప్ ఫండ్స్కు ఉంది. అయినప్పటికీ, వాటికి లార్జ్-క్యాప్ ఫండ్స్ కంటే అధిక రిస్క్కు కొంత అవకాశం ఉంది.

అవి పెట్టుబడి పెట్టే స్టాక్స్ రకాన్నిబట్టి, మిడ్క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్ రెండూ స్వల్ప కాలం నుండి మధ్యకాలిక వ్యవధి వరకు రిస్క్ కలిగి ఉంటాయి. తమ రిటైర్మెంట్, పిల్లల విద్య మొదలైన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్లాన్ చేసుకోవాలనుకునే యువ పెట్టుబడిదారులకు ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే వారు 5-7 సంవత్సరాల వ్యవధిలో ఈ ఫండ్ యొక్క అస్థిరత్వాన్ని తట్టుకోగలిగి ఉంటారు. ఈ అస్థిరత్వానికి కారణం, బ్లూచిప్ స్టాక్స్ లాగా కాకుండా, ఈ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో ఉండే స్టాక్స్ ఇంకా తమ ప్రారంభ పెరుగుదల దశలోనే ఉన్నాయి మరియు బ్లూచిప్ స్టాక్స్ యొక్క స్థిరమైన పెరుగుదల దశను ఇంకా చేరుకోలేదు.

కానీ దీని అర్థం తమ 20 లేదా 30 సంవత్సరాల వయస్సులో ఉన్న యువ పెట్టుబడిదారులు అందరూ ఈ ఫండ్స్ను తమ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలని కాదు. ఒక మోస్తరు నుండి అధిక రిస్క్ పట్ల వ్యతిరేకతగల యువ పెట్టుబడిదారు వీటికి దూరంగా ఉండాలి మరియు వీటికి బదులుగా మరింత స్థిరమైన లార్జ్-క్యాప్ ఫండ్స్కు కట్టుబడి ఉండాలి లేదా ఒకే నిష్పత్తిలో లార్జ్ క్యాప్స్, మిడ్క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్స్ ఉన్న మల్టీక్యాప్ ఫండ్స్ను ప్రయత్నించాలి.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను