మల్టీక్యాప్ మరియు ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ మధ్య తేడా ఏమిటి?

మల్టీక్యాప్ మరియు ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ మధ్య తేడా ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీకు మల్టీ క్యాప్ మరియు ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏమిటి అని సరిగా తెలియకపోతే, మీరు అక్టోబరు 2017 లో జారీచేసిన మరియు జూన్ 2018 నుండి అమలులో ఉన్న సెబీ యొక్క ఉత్పత్తి వర్గీకరణ సర్క్యులర్ చూడవచ్చు. ఈ సర్క్యులర్ మల్టీ క్యాప్ ఫండ్స్ తమ అసెట్స్లో 65% లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్ల వ్యాప్తంగా ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. సెప్టెంబరు 2020 లో, మల్టీ క్యాప్ పెట్టుబడిదారులకు మంచి వైవిధ్యత అందించే లక్ష్యంతో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్లు ప్రతి దానిలో మల్టీ క్యాప్ ఫండ్స్ కనీసం 25% పెట్టుబడి ఉంచాలని సెబీ తప్పనిసరి చేసింది. అయితే, ఇది తమ తమ దృష్టికోణాన్ని బట్టి అవకాశాలను ఉపయోగించుకునే ఫండ్ మేనేజర్ యొక్క సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది, ఎందుకంటే కొన్నిసార్లు సరిగా పని చేయకపోవచ్చనే ఒక నిర్దిష్ట సెగ్మెంట్కు తక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండవచ్చు, అంటే అలా చేస్తే తప్పనిసరి అయిన 25% కనీస మొత్తాన్ని ఉల్లంఘించడం అని అర్థం.

కాబట్టి నవంబరు 2020 లో, సెబీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ప్రవేశపెట్టింది, ఇవి మల్టీ క్యాప్ లాగే ఉంటాయి, కానీ ఒక వెసులుబాటుగల పెట్టుబడి విధానాన్ని పాటిస్తాయి. మల్టీ క్యాప్ మరియు ఫ్లెక్సీ క్యాప్ మధ్య ఉన్న కీలకమైన తేడా, తన అసెట్స్లో 65% ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్లకు కేటాయిస్తూ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్స్ మధ్య కేటాయింపును మార్చుకునేందుకు రెండవదానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ. ఉదాహరణకు, ఆర్థిక అనిశ్చితి సమయంలో స్మాల్ క్యాప్స్లో పెట్టుబడిని తగ్గించాలని ఫండ్ మేనేజర్ అనుకుంటే, అతను/ఆమె ఆ కేటాయింపును సున్నాకు తగ్గించవచ్చు మరియు లార్జ్ క్యాప్స్/మిడ్ క్యాప్స్లో కేటాయింపు పెంచవచ్చు. అయితే అంతటి గతిశీల విధానంలో తన పోర్ట్ఫోలియోను మల్టీ క్యాప్ ఫండ్ నిర్వహించ లేదు.

మార్కెట్ సైకిల్స్తో సంబంధం లేకుండా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు లార్జ్ క్యాప్ కంపెనీల వ్యాప్తంగా మార్కెట్ క్యాపిటలైజేషన్స్లో స్థిర కేటాయింపును పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు మల్టీ క్యాప్ ఎంచుకోవచ్చు. అదే మార్కెట్ పరిస్థితిపై ఆధారపడి, మార్కెట్ క్యాప్స్ వ్యాప్తంగా పెట్టుబడిని పెంచడం/తగ్గించడం చేయగల ఫ్లెక్సిబుల్ పెట్టుబడి వ్యూహాన్ని ఇష్టపడేవారు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఎంచుకోవచ్చు.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను