డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

స్కీమ్ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి పెట్టుబడి కార్యకలాపాల నుండి సంపాదించిన లాభం నుండి మాత్రమే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు డివిడెండ్లు చెల్లిస్తాయి, ఇవి ట్రస్టీ విచక్షణపై ఆధారపడి ఉంటాయి. ఆ స్కీమ్ పడిపోయే మార్కెట్‌లో నష్టాన్ని చవిచూస్తే, డివిడెండ్ చెల్లింపు ప్రకటించరాదని ట్రస్టీలు నిర్ణయించవచ్చు. డివిడెండ్ అనేది లాభం లేదా ఆదాయం కాబట్టి, అది పన్ను కట్టవలసినదిగా భావించబడుతుంది మరియు డివిడెండ్లపై వర్తించే పన్నును డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (DDT) అంటారు. ఇంతకు ముందు డివిడెండ్లకు మూలంలో పన్ను విధించేవారు, అంటే పెట్టుబడిదారులకు డివిడెండ్ పంపిణీ చేయడానికి ముందే స్కీమ్ DDT చెల్లించవలసి వచ్చేది. ఇలా చేయడం వలన సహజంగానే డివిడెండ్ చెల్లింపు మొత్తం తగ్గేది, కానీ పెట్టుబడిదారులకు దానిపై పన్ను ఉండేదికాదు.

1, ఏప్రిల్ 2020 నుండి, DDT రద్దు చేయబడింది మరియు మ్యూచువల్ ఫండ్స్‌కు పెట్టుబడిదారులే పన్ను చెల్లించే పద్ధతి అమలులోకి వచ్చింది. ఇప్పుడు డివిడెండ్ ఆదాయాన్ని ఇతర వనరుల నుండి ఆదాయంగా లెక్కించడం జరుగుతుంది, పెట్టుబడిదారులు దానిపై తమ వ్యక్తిగత పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. కాబట్టి ఇంతకు ముందున్న DDT పన్ను విధానంతో పోల్చితే మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ పన్ను వలన కలిగే నష్టం పెట్టుబడిదారు పన్ను స్లాబ్ మీద ఆధారపడి ఉంటుంది. 

ఇంతకు ముందు, అందరికీ సమాన రేటులో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్‌ను స్కీమ్ మినహాయించిన తర్వాత   పెట్టుబడిదారులు అందరూ డివిడెండ్ పొందేవారు. స్కీమ్ రకాన్నిబట్టి సమాన పన్ను రేటు వర్తింపజేయడం వలన ఆ స్కీమ్ పంపిణీ చేయగల మిగులు తగ్గి పెట్టుబడిదారులు అందరిపై DDT సమాన ప్రభావం పడేది. ఇప్పుడిక ఆ పరిస్థితి లేదు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల నిష్పత్తిలో డివిడెండ్లు పొందుతూ ఉండగా, తక్కువ పన్ను బ్రాకెట్‌లో ఉన్నవారితో పోల్చితే ఎక్కువ పన్ను స్లాబ్‌లో ఉన్న పెట్టుబడిదారు పొందిన డివిడెండ్లపై ఎక్కువ పన్ను చెల్లించాలి.

DDT తీసివేయడం ఒక స్కీమ్‌లో గ్రోత్ మరియు డివిడెండ్ ఆప్షన్లు రెండింటికీ సమాన అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పెట్టుబడిదారులు తమకు వర్తించే మరియు వ్యక్తిగత ఆదాయానికి అవసరమైన అమలులో ఉన్న పన్ను రేటును (సెస్ మరియు సర్‌ఛార్జ్‌తో సహా) దృష్టిలో పెట్టుకుని డివిడెండ్ ఆప్షన్ ఎంచుకోవడంలో ఉన్న ప్రయోజనాలను బేరీజు వేసుకోవాల్సి  ఉంటుంది.

 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను