మ్యూచువల్ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌‌మెంట్‌కు రుజువుగా ఎటువంటి డాక్యుమెంట్స్ అందజేయబడతాయి?

మ్యూచువల్ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌‌మెంట్‌కు రుజువుగా ఎటువంటి డాక్యుమెంట్స్ అందజేయబడతాయి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీరు ఒకసారి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, లావాదేవీ చేసిన తేదీ, ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం, యూనిట్లను కొనుగోలు చేసిన ధర మరియు మీకు కేటాయించబడిన యూనిట్ల సంఖ్య లాంటి వివరాలతో అకౌంట్ స్టేట్‌మెంటుని మీరు అందుకుంటారు.

అకౌంటులో మీరు బహుళ లావాదేవీలు నిర్వహించవచ్చు, అవి స్టేట్‌మెంట్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటాయి. సాధారణ అకౌంట్ స్టేట్మెంట్ చివరి కొన్ని (చాలా వాటిలో దాదాపు 10) లావాదేవీలు - కొనుగోలు లేదా రిడెంషన్; డివిడెండ్లు, ఏవైనా; లేదా వాణిజ్యేతర లావాదేవీలు కూడా లిస్ట్‌ చేయబడతాయి. అకౌంట్ స్టేట్‌మెంట్ మీ తాజా యూనిట్ బ్యాలెన్స్ కౌంట్, ఇటీవల తేదీ ఎన్ఎవి మరియు మీ ఇన్వెస్ట్‌‌మెంట్ల ప్రస్తుత విలువను ఇవ్వగలదు.

మీరు ఒక స్టేట్మెంట్ కోల్పోతే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మరొక దానిని పొందవచ్చు. అకౌంట్ స్టేట్మెంట్ పోగొట్టుకోవడం వలన భవిష్యత్తు లావాదేవీల నుండి, అకౌంట్ నుండి డబ్బు తీసుకోవడం సహా మిమ్మల్ని నివారించదు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను