ఫ్యాక్ట్‌షీట్ అంటే ఏమిటి?

ఫ్యాక్ట్‌షీట్ అంటే ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఫ్యాక్ట్‌షీట్  ఒక్క ప్రయత్నంలోనే ఒక స్కీం గురించిన వివరణాత్మక సమాచారాన్ని పొందేందుకు  మదుపరుడు యాక్సెస్ చేయగల అత్యంత విశ్వసనీయమైన మార్గదర్శకం.  విద్యార్ధి నెలవారీ రిపోర్ట్ కార్డు ఎలా ఉంటుందో మీరు చూశారా? అది  విద్యార్ధి విద్యా సంబంధిత ప్రదర్శనా అంశాలను కవర్ చేయడమే కాకుండా విద్యార్ధి ప్రవర్తన, విద్యా-యేతర కార్యకలాపాలలో పాల్గొనడం, హాజరు వివరాలు, క్రమశిక్షణ మరియు మీరు విద్యార్ధి గురించి తెలుసుకోవలసిన ప్రతి అంశాన్ని కవర్ చేస్తుంది. తరగతిలోని సగటుతో పోలిస్తే విద్యార్ధి ప్రదర్శనా తీరును కూడా రిపోర్ట్ కార్డ్ చూపిస్తుంది. 

ఫండ్ ఫ్యాక్ట్‌షీట్ కూడా అలానే  ఉంటుంది. ప్రతి భవిష్య లేదా ప్రస్తుత మదుపరుడు తప్పక తెలుసుకోవలసిన పెట్టుబడి ఉద్దేశ్యం, బెంచ్‌మార్క్, AUM, ఫండ్ నిర్వాహకులు, అందుబాటులో ఉన్న ఫీచర్ల వంటి ఆప్షన్లు, కనీస పెట్టుబడి మొత్తము, వర్తించే నిష్క్రమణ భారాలు, వివిధ ప్లాన్‌ల NAVలు వంటి ప్రధాన అంశాలను ఇది కవర్ చేస్తుంది. ఇంకా ప్రామాణిక విచలనం (అనిశ్చితి ప్రమాణం), బీటా, షేర్ నిష్పత్తి,  వివిధ ప్లాన్‌ల వ్యయాల నిష్పత్తి మరియు డ్యూరేషన్ సమయంలో ఈక్విటీ ఫండ్ల కొరకు పోర్ట్‌ఫోలియో టర్నోవర్, డెబ్ట్ ఫండ్ల కొరకు వెల్లడించిన పోర్ట్‌ఫోలియో రాబడి మరియు సగటు  మెచ్యూరిటీ  వంటి ముఖ్యమైన ప్రదర్శనా మరియు రిస్క్ పరామితులను ఫ్యాక్ట్‌షీట్‌ కవర్ చేస్తుంది.

రంగాల వ్యాప్తంగా, సెక్యూరిటీల వ్యాప్తంగా గత నెల కొరకు పోర్ట్‌ఫోలియో హోల్డింగులను కూడా ఫ్యాక్ట్‌షీట్ వెల్లడిస్తుంది. ఫండ్ బెంచ్‌మార్క్‌తో పోల్చి, దాని చారిత్రాత్మక ప్రదర్శనా తీరును కూడా ఫ్యాక్ట్‌షీట్ ప్రదర్శిస్తుంది మరియు ఫండ్ రిస్క్ స్థాయిని నిర్దేశిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక మదుపరుడిగా మీరు తప్పక తెలుసుకోవలసిన ప్రతి కీలక సమాచారాన్ని ఫ్యాక్ట్‌షీట్ మీకు అందిస్తుంది.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను