ఎవరైనా ఒక ఈక్విటీ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఏ సమాచారం మరియు రిస్క్ ప్రమాణాలను గురించి ఆలోచించాలి?

ఎవరైనా ఒక ఈక్విటీ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఏ సమాచారం మరియు రిస్క్ ప్రమాణాలను గురించి ఆలోచించాలి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీ పోర్ట్ఫోలియో కోసం ఈక్విటీ ఫండ్ ఎంచుకోవడానికి రెండు దశలుగల ఒక పద్ధతి ప్రకారం చేసే ప్రక్రియ అవసరం. ఇందులో మొదటిది మీ గురించినది మరియు అది మీ పోర్ట్ఫోలియోలో ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అవసరాన్ని లేదా దాని సమయ పరిధితో మీ ఆర్థిక లక్ష్యాన్ని, ఈక్విటీ ఫండ్ పెట్టుబడి రకాన్ని మరియు రిస్క్ తట్టుకోగల మీ శక్తిని గుర్తించడంతో ప్రారంభం అవుతుంది. ఒకసారి ఈ మూడింటిని గుర్తించిన తర్వాత, అందుబాటులో ఉన్న వాటిలో తగిన ఫండ్ ఎంచుకోవడం ఈ ప్రక్రియలో తర్వాతి దశ, అంటే రెండవ దశ.

ఆ విధంగా రెండవ దశలో ఫండ్స్ గురించి కొంత సమాచారాన్ని తెలుసుకోవడం మరియు వివిధ రిస్క్ ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా అధిక గుణాత్మక విధానం ఉపయోగించి, తగిన ఫండ్స్ అన్నింటిలో వెతకడం ఉంటుంది. మీరు ఫండ్ పోర్ట్ఫోలియో, చరిత్ర, ఫండ్ మేనేజర్లు, ఖర్చు నిష్పత్తి, దాని బెంచ్మార్క్ మరియు ఆ ఫండ్ గత కొంతకాలంగా బెంచ్మార్క్తో సరిపోల్చినప్పుడు ఎలా పని చేసింది అనే సమాచారం కోసం చూడాలి.

మీరు పోర్ట్ఫోలియో చూసినప్పుడు, రంగాల కేటాయింపు మరియు స్టాక్ ఎంపిక విషయంలో అది ఎంత వైవిధ్యంగా కనిపిస్తుందో చూడండి. దీన్ని ఫండ్ యొక్క ప్రథాన 10 రంగాలను మరియు స్టాక్ హోల్డింగ్ను బట్టి అంచనావేయవచ్చు. చరిత్ర గురించి మీరు చూసినప్పడు, అది మీకు ఫండ్ ఎన్ని ఆర్థిక సైకిల్స్ను దాటింది అనేదాన్ని గురించి ఒక అభిప్రాయం ఇస్తుంది. బుల్ రన్ సమయంలో, చాలా ఫండ్స్ బాగానే పని చేస్తాయి, అయితే బుల్ మరియు బేర్ల మార్కెట్ దశలతో కూడిన సంపూర్ణ సైకిల్లో ఫండ్స్ ఎలా పని చేశాయి అనేది పోర్ట్ఫోలియో యొక్క ఒడిదుడుకులకు సూచిక. ఫండ్ చరిత్రకు ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్తో సన్నిహిత సంబంధం ఉంటుంది. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ను మెరుగ్గా చూడటానికి అతను/ఆమె నిర్వహిస్తున్న ఇతర ఫండ్స్ను మీరు చూడవచ్చు.

ఫండ్ కార్యాచరణలో ఎంత బాగా నిర్వహించబడుతున్నది అనే దానికి ఖర్చు నిష్పత్తి  ఒక ముఖ్యమైన సూచిక, ఇది ఫండ్ పనితీరుకు భిన్నమైనది. ఖర్చు నిష్పత్తి ఎంత తక్కువ ఉంటే అది పెట్టుబడిదారుకు అంత మంచిది.

తర్వాత, డీవియేషన్ మరియు బీటా లాంటి కీలకమైన ఈక్విటీ ఫండ్ రిస్క్ సూచికలను చూడండి. ఇందులో మొదటిది ఫండ్ రాబడులలో అస్థిరత్వం లేదా దాని నుండి ఆశించిన రాబడులలో హెచ్చుతగ్గుల గురించి ఒక అభిప్రాయం ఇస్తుంది. అధిక స్టాండర్డ్ డీవియేషన్ ఉంటే ఫండ్స్ రాబడులలో ఎక్కువ అస్థిరత్వాన్ని మీరు ఊహించవచ్చు, అంటే ఫండ్ యొక్క అంచనా వేసిన సగటు రాబడి నుండి రెండు వైపులా (సానుకూలంగా, ప్రతికూలంగా కూడా) ఎక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది. బీటా అనేది మార్కెట్ ఒడిదుడుకులలో ఫండ్ యొక్క సున్నితత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి మార్కెట్ పుంజుకున్నప్పుడు మార్కెట్ కంటే ఫండ్ ఎక్కువ పైకి లేస్తుంది మరియు మార్కెట్ పడిపోయినప్పుడు మార్కెట్ కంటే ఎక్కువ పడిపోతుంది. బీటా =1 అనేది ఫండ్ ఎన్ఏవి మార్కెట్ కదలికలకు దగ్గరగా కదులుతుంది అని సూచిస్తుంది. తక్కువ రిస్క్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా బీటా >1 కలిగివుంటాయి.  

మీ పోర్ట్ఫోలియో కోసం అంతిమ ఎంపికను చేసుకోవడానికి ముందు ఫండ్స్ గురించి సమాచారం సేకరించడానికి మరియు విశ్లేషించడానికి మీరే సొంతంగా కొంత సమయం వెచ్చించండి లేదా ఒక ఆర్థిక సలహాదారు నుండి మార్గదర్శనం తీసుకోండి.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను