లాక్-ఇన్ పీరియడ్ అంటే ఏమిటి?

లాక్-ఇన్ పీరియడ్ అంటే ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్లు మీ పెట్టుబడిపై 'లాక్-ఇన్ పీరియడ్'ను విధిస్తాయి. వీటిలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ؚలు (ELSS), డెట్ ఫండ్ؚలలో ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ؚలు (FMP), క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ؚలు ఉన్నాయి. లాక్-ఇన్ పీరియడ్ అనేది పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని కొనసాగించవలసిన కనీస వ్యవధిని సూచిస్తుంది. ఇన్వెస్టర్లు ఆ కాలంలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రిడీమ్ చేయలేరు లేదా విక్రయించలేరు.  లాక్-ఇన్ పీరియడ్ అనేది పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని కొనసాగించవలసిన కనీస వ్యవధిని సూచిస్తుంది. ఇన్వెస్టర్లు ఆ కాలంలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రిడీమ్ చేయలేరు లేదా విక్రయించలేరు.

మ్యూచువల్ ఫండ్ స్కీమ్ రకాన్ని బట్టి లాక్-ఇన్ పీరియడ్ؚలు మారవచ్చు. ఉదాహరణకు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ؚలు (ELSS) అనేది మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో పన్నును ఆదా చేసే మ్యూచువల్ ఫండ్. అంటే మీరు పెట్టుబడి పెట్టిన తేదీ నుండి మూడు సంవత్సరాలు పూర్తి కాకముందే వాటి యూనిట్లను విక్రయించలేరు లేదా రిడీమ్ చేయలేరు. అదేవిధంగా, కొన్ని క్లోజ్డ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్లు పథకం ఆఫర్ డాక్యుమెంట్లో పేర్కొన్న లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉండవచ్చు. మూడేళ్లకు పైగా ఉన్న పెట్టుబడుల నుంచి వచ్చే రాబడులను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG)గా పరిగణిస్తారు. LTCG కోసం పన్ను రేటు సాధారణ ఆదాయానికి వర్తించే రేటు కంటే తక్కువగా ఉంటుంది (వ్యక్తి యొక్క పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాలపై ఆధారపడి ఉంటుంది). అందువల్ల, మూడేళ్ల కంటే ఎక్కువ లాక్-ఇన్ పీరియడ్ ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే చాలా ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్లకు లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. మీరు ఎప్పుడైనా వారి యూనిట్లను కొనుగోలు చేయవచ్చు మరియు విక్రయించవచ్చు.

డెట్ ఫండ్లలో ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ల కోసం, మీరు మీ పెట్టుబడిని లాక్-ఇన్ పీరియడ్ వరకు, అంటే నిర్ణీత కాలానికి ఉంచాలి. ఆ వ్యవధి తరువాత, మీరు మీ యూనిట్లను రిడీమ్ చేసుకోవచ్చు. లాక్-ఇన్ పన్ను ప్రణాళిక కోసం కాదు, కానీ అంతర్లీన రుణ ఆస్తులపై రాబడిని పొందడానికి, దీనిని మెచ్యూరిటీ వరకు కొనసాగించాలి. 

స్వల్పకాలిక ట్రేడింగ్ మరియు స్పెక్యులేషన్ؚను నిరుత్సాహపరచడానికి లాక్-ఇన్ పీరియడ్ؚలను సాధారణంగా అమలు చేస్తారు. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే అలవాటును పెంపొందించుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. 

లాక్-ఇన్ పీరియడ్ప్రాముఖ్యత

  1. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది
  2. మార్కెట్ పతనం సమయంలో ఆకస్మిక నిష్క్రమణలను నిరోధిస్తుంది
  3. పనితీరుపై దృష్టి పెట్టడానికి ఫండ్ మేనేజర్లను అనుమతిస్తుంది
  4. రాబడిలో అస్థిరతను తగ్గిస్తుంది

లాక్-ఇన్ పీరియడ్ తర్వాత ఫండ్ రకాన్ని బట్టి, మీ పెట్టుబడిని వెంటనే విక్రయించే బదులు, దానిని మదింపు చేయండి. ఇది మీ అంచనాలను చేరుకుంటే, మీరు దానిని కొనసాగించడాన్ని లేదా మరింత ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ పథకాలను మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలతో అనుసంధానం చేయడం ద్వారా మరియు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అవలంబించడం ద్వారా, మీరు వాటిని సాధించడానికి కాంపౌండింగ్ శక్తిని ఉపయోగించుకోవచ్చు.

డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

282
285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను