మ్యూచువల్ ఫండ్స్‌లో లిక్విడిటీ అంటే ఏమిటి?
1 నిమిషం 23 సెకన్ల పఠన సమయం

ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం చాలా మందికి లాభదాయకమైన నిర్ణయం కావచ్చు, కానీ మీ పెట్టుబడి ఎంపికలను ప్రభావితం చేసే విభిన్న భావనలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందులో ఒక ముఖ్యమైన భావన లిక్విడిటీ.
కాబట్టి, లిక్విడిటీ అంటే ఏమిటి? పెట్టుబడులలో లిక్విడిటీ అంటే ఒక వ్యక్తి తన పెట్టుబడులను ఎంత త్వరగా మరియు సులభంగా నగదుగా మార్చగలడు. ఒక ఆస్తి లిక్విడిటీ ఎక్కువగా ఉంటే, మీరు దానిని త్వరగా నగదుగా మార్చగలుగుతారు మరియు ఈ మార్పిడి చేయడానికి తక్కువ ఖర్చు కూడా అవసరం. అయితే, ఒక ఆస్తి ఎంత తక్కువ లిక్విడ్టీటీగా ఉంటే, అది నగదుగా మార్చడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది మరియు మరింత ఖరీదైనదిగా మారుతుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో లిక్విడిటీ: మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంది తమ డబ్బును సమీకరించే ఒక మార్గం, మరియు ఫండ్ మేనేజర్ ఆ డబ్బును స్టాక్స్, బాండ్లు లేదా ఇతర ఆస్తుల మిశ్రమంలో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్ నుండి మీ డబ్బును పొందడం ఎంత సులభం అనేది ఫండ్ పెట్టుబడి పెట్టే ఆస్తులను కొనడం లేదా విక్రయించడం ఎంత సులభం అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ పాపులర్ స్టాక్స్ లేదా గవర్నమెంట్ బాండ్స్ వంటి కొనడానికి లేదా అమ్మడానికి సులభమైన సెక్యూరిటీలలో పెట్టుబడి పెడితే, అది మరింత లిక్విడ్‌గా పరిగణించబడుతుంది. అయితే, ఫండ్ తరచుగా ట్రేడింగ్ చేయని ఆస్తులలో పెట్టుబడి పెడితే, మీరు రిడీమ్ చేయాలనుకున్నప్పుడు మీ డబ్బును తిరిగి పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది.
అదనంగా, మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీ పెట్టుబడి ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ ఇవ్వబడింది:
షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్: మీరు స్వల్పకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే, అధిక లిక్విడ్ అసెట్స్ అనువైనవి ఎందుకంటే వాటిని త్వరగా విక్రయించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో, లిక్విడిటీకి తక్కువ ప్రాధాన్యత ఉండవచ్చు, ఎందుకంటే పెట్టుబడిదారులు సాధారణంగా మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా ఆస్తులను నిలుపుకోవచ్చు, కాలక్రమేణా సంభావ్య వృద్ధిపై దృష్టి పెడతారు.
రిస్క్ మేనేజ్మెంట్: మీరు తక్కువ రిస్క్‌ను ఇష్టపడితే, అధిక లిక్విడ్ ఆస్తులు మంచి ఎంపిక ఎందుకంటే అవి అధిక డిమాండ్ కలిగి ఉంటాయి మరియు తక్కువ అస్థిరంగా ఉంటాయి. తక్కువ లిక్విడ్ ఆస్తులు వాటి అధిక అస్థిరత మరియు విక్రయించేటప్పుడు ఖర్చులు పెరిగే అవకాశం కారణంగా రిస్క్‌తో కూడుకున్నవి.
అత్యవసర పరిస్థితులను నిర్వహించడం: అధిక లిక్విడ్ ఆస్తులను త్వరగా విక్రయించడం సులభం, ఇది అత్యవసర పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ లిక్విడ్ ఆస్తులు విక్రయించడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది మీకు వేగంగా నగదు అవసరమైనప్పుడు సమస్య కావచ్చు.
అంతే కాకుండా, లిక్విడిటీ రిస్క్ అనేది ఒక పెట్టుబడిదారుడు తన పెట్టుబడిని సులభంగా నగదుగా మార్చలేని పరిస్థితిని సూచిస్తుంది.
కాబట్టి, లిక్విడిటీ అనేది అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇది మీరు పెట్టుబడిని నగదుగా ఎంత సులభంగా మార్చవచ్చోదాన్ని ప్రభావితం చేస్తుంది మరియు పోర్ట్ؚఫోలియో సాధారణ రిస్క్ మరియు రాబడిని ప్రభావితం చేస్తుంది.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.