మనీ మార్కెట్ ఫండ్ అంటే ఏమిటి?

మనీ మార్కెట్ ఫండ్ అంటే ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మనీ మార్కెట్ ఫండ్‌లు అనేవి ఒక రకమైన మ్యూచువల్ ఫండ్, ఇది ప్రధానంగా ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడి పెడుతుంది. మనీ మార్కెట్ అంటే చాలా స్వల్పకాలిక స్థిరాదాయ సాధనాలతో వ్యవహరించే ఆర్థిక మార్కెట్. మనీ మార్కెట్ ఫండ్‌ల సాధారణ భాగస్వాములు బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారులు, కార్పొరేషన్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు మరియు మరెన్నో. 

మనీ మార్కెట్ ఫండ్ ముఖ్యంగా తక్కువ పెట్టుబడి వ్యవధి, అధిక లిక్విడిటీ, తక్కువ వడ్డీ రేట్లు మరియు సాపేక్షంగా తక్కువ రాబడులు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. 

మనీ మార్కెట్ ఫండ్‌లు 1 సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలానికి సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి కాబట్టి, మంచి రాబడిని సంపాదించడానికి మరియు రిస్క్‌ను అదుపులో ఉంచడానికి కాలవ్యవధిని సవరిస్తూ ఉంటాయి. 

అంతేకాకుండా, ఈ ఫండ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్‌ల విధంగానే పనిచేస్తాయి, అయితే ఋణ వ్యవధి సర్దుబాట్ల ద్వారా రిస్క్‌లను అదుపులో ఉంచుతూ ఫండ్ మేనేజర్ అధిక రాబడిని అందించగలిగేలా వీటిని రూపొందించారు. 

మనీ మార్కెట్ ఫండ్ ప్రాథమిక లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

మెచ్యూరిటీ కాలపరిమితి తక్కువగా ఉంటుంది: ఫండ్ విభాగాన్ని బట్టి మనీ మార్కెట్ ఫండ్‌లు ఒక రోజు నుండి ఏడాది వరకు ఉంటాయి.

ఇవి తక్కువ వడ్డీ రేట్లును కలిగి ఉంటాయి: స్థిర-ఆదాయ సెక్యూరిటీల వడ్డీ రేటు సున్నితత్వం వాటి మెచ్యూరిటీ కాలంతో నేరుగా ముడిపడి ఉంటుంది. మెచ్యూరిటీ ఎంత ఎక్కువ అయితే వడ్డీ రేటు అంత ఎక్కువగా ఉంటుంది.

అధిక లిక్విడిటీని కలిగి ఉంటాయి: లిక్విడ్ మరియు సురక్షిత ఋణ ఆధారిత ఆస్తులలో పెట్టుబడి పెట్టడం వలన అధిక స్థాయి లిక్విడిటీని అందిస్తాయి.

తక్కువ రాబడులు: మెచ్యూరిటీ ఎంత ఎక్కువ అయితే స్థిర-ఆదాయ సెక్యూరిటీల రాబడి అంత ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ ఎంత తక్కువగా ఉంటే స్థిర ఆదాయ సెక్యూరిటీల రాబడి అంత తక్కువగా ఉంటుంది. NCDలు (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు), G-బాండ్స్ మరియు మరెన్నో వాటితో పోలిస్తే మనీ మార్కెట్ ఫండ్‌లు తక్కువ మెచ్యూరిటీలతో వస్తాయి కాబట్టి, వాటి రాబడులు దీర్ఘకాలిక సెక్యూరిటీల కంటే తక్కువగా ఉంటాయి.

ఇతర పెట్టుబడి ఎంపికల విధంగానే, మనీ మార్కెట్ ఫండ్‌ల కూడా వాటి లాభాలు మరియు నష్టాలను కలిగి ఉంటాయి మరియు పెట్టుబడి పెట్టే ముందు వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, మనీ మార్కెట్ ఫండ్‌లు దీర్ఘకాలిక పెట్టుబడికి అనువైనవి కావు, కానీ స్వల్పకాలికంగా మాత్రమే పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకు ఇవి మంచి పెట్టుబడి ఎంపిక. 

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను