డివిడెండ్ అంటే ఏమిటి?

డివిడెండ్ అంటే ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

డివిడెండ్ స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్ నుండి సంపాదించినవి పంపిణీ చేసేది. మ్యూచువల్ ఫండ్ స్కీములలో ఫండ్ తన పోర్ట్ఫోలియోలో సెక్యూరిటీల అమ్మకం పైన లాభాన్ని బుక్ చేసినప్పుడు డివిడెండ్లు పంపిణీ చేయబడతాయి.

నియంత్రణ ప్రకారం, ఫండ్ పోర్ట్ఫోలియోలో సెక్యూరిటీల అమ్మకాల నుండి చేసిన లాభాల నుండి, ఏదైనా సంవత్సరం లోపు వచ్చే ఆదాయం, వడ్డీ లేదా డివిడెండ్ల నుండి ప్రకటించబడతాయి. అట్టి లాభాలు డివిడెండ్ ఈక్విలైజేషన్ రిజర్వుకు చేర్చబడతాయి మరియు డివిడెండ్ ప్రకటన ట్రస్టీల విచక్షణ పై అధారపడతాయి.

డివిడెండ్లు స్కీమ్ ఫేస్ వ్యాల్యూ (FV) శాతంగా ప్రకటించబడతాయి, NAV గా కాదు. ఒక్కో యూనిట్ FV రూ. 10 మరియు డివిడెండ్ రేటు 20% అయితే, డివిడెండ్ ఆప్షన్‌లో ఉన్న ప్రతి పెట్టుబడిదారుడు రూ. 2 డివిడెండ్‌గా పొందుతారు. అయితే, డివిడెండ్ ప్రకటన తర్వాత ఆ స్కీమ్ NAV అంతే మొత్తంలో తగ్గిపోతుంది. గ్రోత్ ఆప్షన్‌లో ఉన్న పెట్టుబడిదారులు డివిడెండ్‌కు అర్హులు కాదు, వీరి విషయంలో స్కీమ్ నుండి వచ్చిన లాభం తిరిగి స్కీమ్‌లో కలపబడుతుంది. ఆవిధంగా, NAV గ్రోత్ ఆప్షన్, డివిడెండ్ ఆప్షన్‌తో పోల్చితే పెరుగుతుంది.

01, ఏప్రిల్ 2020 నుండి, మ్యూచువల్ ఫండ్స్ నుండి వచ్చిన డివిడెండ్లకు పెట్టుబడిదారులు పన్ను చెల్లించాల్సి  ఉంటుంది.  డివిడెండ్ చెల్లింపు ఎంచుకున్న పెట్టుబడిదారులు ఇప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో పొందిన డివిడెండ్ ఆదాయం మీద వారికి వర్తించే అత్యధిక ఆదాయపుపన్ను రేటులో పన్ను చెల్లించాలి. డివిడెండ్ తిరిగి పెట్టుబడి పెట్టడం ఎంచుకున్న పెట్టుబడిదారులకు వారి పన్నులపై ఎలాంటి ప్రభావం ఉండదు, ఎందుకంటే వారు వారి ఫోలియోలో కేటాయించబడిన అదనపు యూనిట్లపరంగా లాభం పొందుతారు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను