సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏమిటి?

సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

సిస్టమాటిక్ రిస్క్ అనేది మొత్తం మార్కెట్ؚను లేదా మార్కెట్ؚలో అధిక భాగాన్ని ప్రభావితం చేసే రిస్క్. దీన్నే మార్కెట్ రిస్క్ అని కూడా అంటారు. ఆర్థిక, సామాజిక-రాజకీయ మరియు మార్కెట్ సంబంధిత పరిస్థితులతో సహా వివిధ కారకాల కలయికతో ఇది మొత్తం మార్కెట్ؚకు స్వాభావికంగా ఉండే రిస్క్. అటువంటి సంఘటన సంభవించే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు దానిని పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇది కాస్కేడింగ్ ప్రభావాన్ని చూపే కారకాలతో సంబంధం ఉన్న అనిశ్చితిని హైలైట్ చేస్తుంది.


సిస్టమాటిక్ రిస్క్ రకాలు

1) మార్కెట్ రిస్క్
మార్కెట్ అస్థిరత, పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరియు సరఫరా/డిమాండ్ ధోరణులతో సహా పెట్టుబడి పనితీరుపై సాధారణ మార్కెట్ పరిస్థితుల సంభావ్య ప్రభావాన్ని మార్కెట్ రిస్క్ సూచిస్తుంది. ఈ సాధారణ మార్కెట్ కారకాలు వివిధ రకాల పెట్టుబడుల పనితీరును ప్రభావితం చేస్తాయి.
2) వడ్డీ రేటు రిస్క్
వడ్డీ రేటు రిస్క్ అనేది వడ్డీ రేటు మార్పులు పెట్టుబడి పనితీరును ప్రభావితం చేసే అవకాశాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, బాండ్‌లు వంటి స్థిర-ఆదాయ ఉత్పత్తులు వడ్డీ రేట్లు పెరిగినప్పుడు తరచుగా విలువను కోల్పోతాయి.
3) ద్రవ్యోల్బణ రిస్క్
ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే అధిక వడ్డీ రేట్లు, ఈక్విటీ మరియు బాండ్ మార్కెట్‌లలో అమ్మకాలు వెల్లువెత్తే అవకాశం ఉంది.
4) పొలిటికల్ రిస్క్
ప్రభుత్వ విధానంలో ఆకస్మిక మార్పులు లేదా పొలిటికల్ రిస్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది పెట్టుబడుల పనితీరుపై ప్రభావం చూపుతుంది.
5) కరెన్సీ రిస్క్
సీమాంతర పెట్టుబడి కరెన్సీ రిస్క్ؚతో వస్తుంది. విదేశీ మారక మార్కెట్లలో అస్థిరతతో మీ పెట్టుబడి విలువ హెచ్చుతగ్గులకు లోనవుతుంది.


డిస్క్లైమర్ 
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను