మ్యూచువల్ ఫండ్‌లో టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI) అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్‌లో టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI) అంటే ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఈక్విటీ ఇండెక్స్‌లను మదింపు చేయడంలో టోటల్ రిటర్న్ ఇండెక్స్, (TRI), కీలక పాత్ర పోషిస్తుంది. 


ఇండెక్స్ టోటల్ రిటర్న్ వేరియంట్ (TRI) మూలధన లాభాలు అలాగే ఇండెక్స్‌ను రూపొందించే భాగాల బాస్కెట్ నుండి ఉత్పన్నమయ్యే అన్ని డివిడెండ్‌లు/వడ్డీ చెల్లింపులను పరిగణనంలోకి తీసుకుంటుంది. అందువల్ల, మ్యూచువల్ ఫండ్ పథకాల పనితీరును పోల్చడానికి TRI బెంచ్‌మార్క్‌గా మరింత సముచితమైనది.


TRI ముఖ్య లక్షణాలు:

SEBI మాండేట్: మ్యూచువల్ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి 2018లో SEBI TRIని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం, మ్యూచువల్ ఫండ్స్ వాటి పనితీరును ప్రైస్ రిటర్న్ ఇండెక్స్ (మునుపటి పద్ధతి) కంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఆధారంగా వెల్లడించాలి, ఇది మూలధన పెరుగుదలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ అనుసరణ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా పరిశ్రమ ప్రమాణాలను కూడా కాపాడుతుంది.
దివిడెంట్‌లను పొందుపరుస్తుంది: ఈ ఆదాయంలో స్టాక్ డివిడెంట్స్, బాండ్స్ నుండి వచ్చే వడ్డీ మరియు బెంచ్మార్క్ ఇండెక్స్‌లోని ఇతర ఆదాయ వనరులు ఉంటాయి. 
రీఇన్వెస్ట్‌మెంట్: డివిడెంట్స్ వంటి ఏదైనా ఆదాయం పొందినప్పుడు ఇండెక్స్లో తిరిగి ఇన్వెస్ట్ చేయబడుతుందని TRI భావిస్తుంది. 
ఇన్వెస్టర్ పారదర్శకత: ఇది ఫండ్ పనితీరుపై వాస్తవిక మరియు పారదర్శక దృక్పథాన్ని అందిస్తుంది. ఇది కాలక్రమేణా పథకం యొక్క పెరుగుదల మరియు పనితీరును అంచనా వేయడానికి మార్గదర్శక సూచనగా పనిచేస్తుంది.
దీర్ఘకాలిక లక్ష్యాలు: దీర్ఘకాలంగా ఫండ్‌లను మూల్యాంకనం చేయడానికి TRI అనువైనది.

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
 

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను