మ్యూచువల్ ఫండ్స్ؚలో ట్రెయిలింగ్ మరియు రోలింగ్ రిటర్న్స్ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్స్ؚలో ట్రెయిలింగ్ మరియు రోలింగ్ రిటర్న్స్ అంటే ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్ పనితీరు దాని రాబడులు లేదా పనితీరు ఆధారంగా అంచనా వేయబడుతుంది మరియు మ్యూచువల్ ఫండ్స్ పనితీరును అంచనా వేయడానికి ఉపయోగించే రెండు ముఖ్యమైన పనితీరు కొలమానాలు:

(ఎ) ట్రెయిలింగ్ రిటర్న్స్
(బి) రోలింగ్ రిటర్న్స్

కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ؚలో రాబడులను లెక్కించడానికి విస్తృతంగా ఉపయోగించే రెండు పద్ధతుల వెనుక ఉన్న భావనలను మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం మరియు వాటి మధ్య వ్యత్యాసాలు తెలుసుకుందాం. ఆయా బెంచ్‌మార్క్‌తో పోల్చితే స్కీమ్ రాబడులు అవుట్-పెర్ఫార్మెన్స్ లేదా స్కీమ్ పనితీరును ప్రతిబింబిస్తాయి.

ట్రెయిలింగ్ రిటర్న్స్:
మ్యూచువల్ ఫండ్స్ లో ట్రెయిలింగ్ రిటర్న్స్ అనేది రెండు నిర్దిష్ట తేదీల మధ్య ఒక ఫండ్ ఎలా పనిచేస్తుందో లెక్కించడానికి ఒక మార్గం. ట్రెయిలింగ్ రిటర్న్స్ ను సాధారణంగా "పాయింట్-టు-పాయింట్" రిటర్న్స్ అని కూడా పిలుస్తారు. అవి ఒక నిర్దిష్ట సమయంలో ఫండ్ పనితీరు యొక్క సంక్షిప్త అవలోకనాన్ని అందిస్తాయి మరియు సంవత్సరం ప్రారంభం నుండి ఏదైనా నిర్దిష్ట తేదీ వరకు (YTD), ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు మరియు అంతకు మించి లేదా ఫండ్ ప్రారంభం నుండి నేటి వరకు వివిధ కాలపరిమితులలో దీనిని లెక్కించవచ్చు.  

రోలింగ్ రిటర్న్స్:
రోలింగ్ రిటర్న్స్, కొన్నిసార్లు "రోలింగ్ పీరియడ్ రిటర్న్స్" లేదా "రోలింగ్ టైమ్ పీరియడ్స్" అని పిలుస్తారు, ఇది ఒక నిర్దిష్ట కాలపరిమితికి లెక్కించబడిన సగటు వార్షిక రాబడులను సూచిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ కాలక్రమేణా ఎలా పనిచేస్తాయో అంచనా వేయడానికి ఇవి విలువైన మార్గాన్ని అందిస్తాయి, పెట్టుబడిదారుల హోల్డింగ్ వ్యవధి యొక్క వాస్తవ అనుభవాలను ప్రతిబింబిస్తాయి. ఒక పోర్ట్ఫోలియో లేదా ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్‌లను లెక్కించడానికి దాని చరిత్రలోని వివిధ కాల వ్యవధులలో సున్నితమైన పనితీరు దృక్పథాన్ని అందిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ రోలింగ్ రిటర్న్‌లను లెక్కించడానికి, మీరు రోజువారీ, వారపు లేదా నెలవారీ వంటి నిర్దిష్ట విరామాన్ని ఉపయోగించి వివిధ కాల వ్యవధుల్లో ఫండ్ పనితీరును విశ్లేషించి, ఈ ప్రతి కాలానికి సగటు వార్షిక రాబడులను లెక్కించాలి. 

చివరిగా, ట్రెయిలింగ్ రిటర్న్స్ ఒక నిర్దిష్ట కాలంలో ఫండ్ యొక్క చారిత్రక పనితీరును కొలుస్తుంది, అయితే రోలింగ్ రిటర్న్స్ వివిధ ఓవర్ؚలాపింగ్ టైమ్ ఫ్రేమ్ؚలలో పనితీరును విశ్లేషిస్తూ మరింత డైనమిక్ దృక్పథాన్ని అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్ యొక్క భవిష్యత్తు రాబడుల కోసం ఫండ్ యొక్క స్థిరత్వం మరియు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ కొలమానాలు పెట్టుబడిదారులకు సహాయపడతాయి.

డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
 

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను