రెండు లేదా మరిన్ని ఇన్స్టాల్మెంట్లు తప్పితే, మ్యూచువల్ ఫండ్స్ ఏమి చేస్తాయి?

రెండు లేదా మరిన్ని ఇన్స్టాల్మెంట్లు తప్పితే, మ్యూచువల్ ఫండ్స్ ఏమి చేస్తాయి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీరు మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్ పీరియాడిక్ పెట్టుబడిలు మరియు/లేదా ఏకమొత్తం పెట్టుబడిల ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. 1వ సందర్భంలో, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న అంతరాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. రోజువారీ/వారంవారీ/నెలవారీ అంతరంలో, మీరు మీ పెట్టుబడిలని ఎస్ఐపి ద్వారా ఆటోమేట్ చేయవచ్చు.

ఈ ఆటోమేషన్ ని పోస్ట్ డేటెడ్ చెక్కులు లేదా బ్యాంకు అకౌంట్ల నుండి ఎలక్ట్రానిక్ డెబిట్ రూపంలో చేయవచ్చు. ‘డైరెక్ట్ డెబిట్‘ ఫెసిలిటీ లేదా ఎన్ఎసిహెచ్ (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్) ద్వారా ఎలక్ట్రానిక్ డెబిట్స్ సెట్ అప్ చేయవచ్చు. దరఖాస్తు పత్రాలు సంబంధిత మ్యూచువల్ ఫండ్స్ వద్ద, ప్రాసెస్ కొరకు అందుబాటులో ఉంటాయి.

ప్రతి నెల మీరు ఒక తాజా ఫారం నింపకుండా లేదా ఏ స్కీములో ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించకుండా ఇది మీ శ్రమలని తగ్గిస్తుంది. స్కీము, మొత్తం మరియు తేదీని ఎన్నుకోండిచాలు, మీ ట్రాన్సాక్షన్లు అన్నీ మారు ఎన్నుకున్న కాలానికి ఆటోమాటికల్‌గా జరిగిపోతాయి. మీరి ఆరు నెలలకు లేదా ఎక్కువకు ఒక ఎస్ఐపి సెట్ అప్ చేయవచ్చు. మీ బ్యాంకు అకౌంటులో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి.

మీ ప్రశ్న ఇక్కడ సరిగా సరిపోతుంది. మీరు వరుసగా రెండు లేదా మూడు ఇన్స్టాల్మెంట్లు తప్పితే, ఫండ్ హౌస్ పోస్ట్ డేటెడ్ చెక్కులను డిపాజిట్ చేయడం ఆపుతుంది మరియు అన్ని ఉపయోగించని చెక్కులు తిరిగి ఇవ్వచ్చు లేదా మీ అకౌంటుకి డెబిట్ చేయడం ఆపవచ్చు. పెనాల్టీ ఏదీ విధించబడదు లేదా పెట్టిన డబ్బులు వదులు కోవడం ఏదీ ఉండదు.

మీరు మీ ఎస్ఐపిని, అదే అకౌంటులో, ఏదైనా సమయంలో మళ్లీ ప్రారంభించవచ్చు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను