మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ప్రారంభించడానికి అత్యంత సులభమైన మార్గం ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఒక బ్యాంకు ఖాతా తెరవడానికి ప్రారంభంలో కొన్ని పేపర్లు అవసరమవుతాయి, దాని తర్వాత మీరు  అన్ని సర్వీసులను నిరాటంకంగా  ఉపయోగించుకోగలరు, సరిగ్గా అలాగే, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే అనుభవం  కూడా ఉంటుంది. మీ మ్యూచువల్ ఫండ్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ప్రాధమిక ఆవశ్యకం వెరిఫికేషన్ కోసం అవసరమైన పేపర్లు సబ్మిట్ చేయడం ద్వారా మీ KYC పూర్తి చేయడం. ఒక్కసారి KYC పూర్తి చేస్తే, మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో అయినా ఏ మొత్తం అయినా ఎప్పుడైనా పెట్టుబడి పెట్టవచ్చు. 

KYC అనేది ఒక్కసారి చేసే ప్రక్రియ, ఇది మ్యూచువల్ ఫండ్స్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి కీలకం. ఇది ఏ మ్యూచువల్ ఫండ్లో అయినా మీరు చేరడాన్ని సునాయాసం చేస్తుంది మరియు KYCని ఒక్కసారి వెరిఫై చేస్తే ఇదంతా మీరు మీ ఇంటి సౌకర్యం అనుభవిస్తూ ఇంటి నుండే చేయవచ్చు.  ఈరోజుల్లో, మీరు పూర్తిగా ఆన్లైన్ అయిన e-KYC కూడా ఎంచుకోవచ్చు. కానీ e-KYC మీ పెట్టుబడులను ఒక్కో ఫండ్ హౌస్కు ఏడాదికి రూ. 50,000 కు పరిమితం చేస్తుంది. 

KYC వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత, డిస్టిబ్యూటర్ ద్వారా గానీ లేదా నేరుగా గానీ మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో అయినా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్కు రిడెంప్షన్ అభ్యర్థన సబ్మిట్ చేయడం ద్వారా మీరు మీ డబ్బును ఏ సమయంలోనైనా విత్డ్రా చేయవచ్చు మరియు డబ్బు మీ 3-4 పని దినాల్లో నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.  వాస్తవానికి,  SIP ద్వారా పెట్టుబడి పెట్టడం, అమ్మడం మరియు ఒక స్కీమ్ నుండి మరో దానికి స్విఛ్ అవ్వడం లాంటి మీ లావాదేవీల్లో చాలా వాటిని మీరు మీ ఇంటి సౌకర్యం అనుభవిస్తూ ఇంటి నుండే ఆన్లైన్లో చేయవచ్చు. 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను