మ్యూచువల్ ఫండ్లలో నామినేషన్ కు ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వబడింది, మరియు దాని ప్రక్రియ ఏమిటి?

Video
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

పూర్వం రాజులు తమ వారసుడి గురించి పడే తపనను మనం చరిత్ర పుస్తకాల్లో మరియు కథల్లో చదివాము. రాజులు తమ రాజ్యాన్ని సరైన వారసుడికి పంచెనట్లే, మీరు కూడా చట్టబద్ధంగా అమలు చేయగల వీలునామా ద్వారా మీ ఆస్తులకు వారసులకు పంపిణీ చెయ్యడం మంచిది. చాలా మండి తాము జీవించి ఉన్న సమయంలో వీలునామా వ్రాయరు. ఆవిధంగా వీలునామా వ్రాయకుండా మరణించడం వల్ల ఆ వ్యక్తి యొక్క ఆస్తులు వారసత్వంగా ఎవరికి ఇవ్వాలనే విషయమై వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో నామినిషన్ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ లో నామినేషన్ అనగా ఒక పెట్టుబడిదారుడు తాను కొని పెట్టుకున్న మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తన మరణానంతరం క్లెయిమ్ చేయగల వ్యక్తిని నామినేట్ చేయడానికి లేదా ఈ యూనిట్లను తిరిగి పొందటానికి వీలు కల్పించే ఒక సౌకర్యం. పెట్టుబడిదారుడు అతని / ఆమె ఖాతాలో నామినీ పేరును పేర్కొనకపోతే, అతడి లేదా ఆమె మరణానంతరం ఆ మొత్తాలను పెట్టుబడిదారుడి చట్టపరమైన వారసుడు (లు) క్లెయిమ్ చెయ్యాలంటే వారి చట్టపరమైన వారసత్వాన్ని రుజువు చేసిన తరువాత మాత్రమే క్లెయిమ్ చేయవలసి ఉంటుంది, ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. అందువల్ల దురదృష్టకర సంఘటన జరిగితే ఆస్తులను సజావుగా పంపిణీ చేయడానికి మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులలో నామినీలు ఉండటం మంచిది.

మీకు మ్యూచువల్ ఫండ్ కు సంబంధించిన ఆన్లైన్ ఖాతా ఉన్నట్లయితే, మీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్లో నామినీలను జోడించడం లేదా ఇప్పటికే ఉన్న నామినీలను నవీకరించడం వంటివి ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఆవిధమైన మార్పులు, చేర్పులు చెయ్యడానికి మీరు మీ ఖాతాలోకి లాగిన్ అయి, నామినీలను జోడించడం / నవీకరించడం అనే ఫోలియోను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత, ఏ నామినీకి ఎంత శాతం యాజమాన్య హక్కు ఇవ్వాలి అన్న అంశంతో పాటు ఆ నామినీల పేర్లు, చిరునామాలు వంటి వివరాలను పూరించండి. ఏ నామినీకి ఎంత శాతం ఇవ్వాలి అన్న అంశం గనుక అందులో పేర్కొనకపోయినట్లయితే, నామినీలందరూ సమాన భాగం పొందడానికి అర్హతకలిగి ఉంటారు.

మీకు ఆన్లైన్ సౌకర్యంగా లేనట్లయితే, మీ ఫోలియోలో నామినీ వివరాలను జోడించడానికి / నవీకరించడానికి మీరు ఫండ్ హౌస్ యొక్క సమీప శాఖ లేదా ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్ను సందర్శించవచ్చు. అక్కడికి వెళ్ళాక మీరు నామినేషన్లకు సంబంధించిన వివరాలను పేర్కొంటూ వ్రాతపూర్వక దరఖాస్తును సమర్పించడం లేదా సాధారణ దరఖాస్తు ఫారమ్ యొక్క సంబంధిత విభాగాన్ని పూరించడం చేయవలసి ఉంటుంది. ఆ సమయంలో మీరు నామినీలను మరియు నామినీల పేర్లను జోడించవలసిన / నవీకరించవలసిన ఖాతా / ఫోలియోను అందులో సూచించాలి.

ఒక ఖాతాలో ఒకటి కంటే ఎక్కువమంది నామినీలున్నట్లయితే, మీరు ఆ నామినీలలో ఒక్కొక్కరికి మీ పెట్టుబడుల నుండి కేటాయించదలచిన శాతాన్ని పేర్కొనాలి. మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఖాతాలన్నింటిలోనూ నామినీల వివరాలను నవీకరించండి. ఒకవేళ దురదృష్టకర సంఘటన జరిగితే మీ పెట్టుబడులను క్లెయిమ్ చేయడానికి మీ కుటుంబ సభ్యులను వారి చట్టపరమైన వారసత్వాన్ని నిరూపించుకోవలసిన ఇబ్బంది నుండి రక్షించండి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను