ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఫిక్స్డ్-ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్, (ఇది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్) ఫండ్ ఆస్తి కేటాయింపు మరియు SEBI అనుమతించదగిన మార్గదర్శకాలు మరియు పరిమితుల ఆధారంగా కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, మనీ మార్కెట్ సాధనాలు మరియు ఇతర డెట్ సెక్యూరిటీలతో సహా స్థిర-ఆదాయ ఆస్తులలోకి పెట్టుబడులను నిర్దేశిస్తుంది. ఇవి వడ్డీ మరియు మూలధన వృద్ధి ద్వారా రాబడులను లక్ష్యంగా చేసుకుంటాయి, ఈ అనుకూలత వివిధ పెట్టుబడి లక్ష్యాలు మరియు రిస్క్ టాలరెన్స్ లకు సరిపోతుంది. వీటిని ప్రత్యామ్నాయంగా డెట్ లేదా బాండ్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు.

ఫిక్స్డ్-ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అనేక ఫీచర్లనుఅందిస్తాయి, అవి:

  • వైవిధ్యత: ఈ ఫండ్లు ప్రభుత్వ మరియు కార్పొరేట్ బాండ్లతో సహా స్థిర-ఆదాయ సెక్యూరిటీల శ్రేణిలో పెట్టుబడులను విస్తరించాయి, తద్వారా వైవిధ్యత కారణంగా మొత్తం పోర్ట్ఫోలియో రిస్క్ను తగ్గిస్తాయి.
  • లిక్విడిటీ: ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ లిక్విడిటీని అందిస్తాయి, వీటికి ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు కనుక, ముఖ్యంగా అత్యవసర ఆర్థిక పరిస్థితులలో ఉపయోగపడతాయి.
  • సాపేక్షంగా తక్కువ రిస్క్: ఈ ఫండ్లు పూర్తిగా రిస్క్ లేనివి కానప్పటికీ, తక్కువ నుండి మీడియం-రిస్క్ కలవిగా విస్తృతంగా పరిగణించబడతాయి.
  • అదనపు ఆదాయం: ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ నగదు ప్రవాహాన్ని సృష్టించడానికి అదనపు మార్గాన్ని అందిస్తాయి, ముఖ్యంగా క్రమబద్ధమైన ఉపసంహరణ ప్రణాళికల ద్వారా, నిర్వహణ ఫీజులు మీ ప్రాధమిక ఆదాయాలను ప్రభావితం చేస్తాయి, తద్వారా మొత్తం ఆర్థిక స్థితిస్థాపకతను పెంచుతాయి.
  • రిటైర్మెంట్ ప్లానింగ్: మార్కెట్ రిస్క్ మరియు ఫండ్ పనితీరుకు లోబడి సిస్టమేటిక్ విత్ؚడ్రాయల్ ప్లాన్ؚల ద్వారా ఉద్యోగానంతర సంవత్సరాల్లో సాపేక్షంగా తక్కువ రిస్క్ మరియు రాబడులతో స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని సృష్టించడం ద్వారా ఈ ఫండ్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ؚలో కీలక పాత్రను పోషిస్తాయి.

ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ పట్ల విముఖతఉన్న పెట్టుబడిదారులకు ఆకట్టుకుంటాయి. అధిక-రిస్క్ వెంచర్ల కంటే స్థిరమైన, మితమైన రాబడికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులకు ఇవి తగినవి.

ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ రాబడులకు హామీ ఇవ్వవని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవ రాబడులు మార్కెట్ పరిస్థితులు మరియు వివిధ కారకాలపై ఆధారపడి ఉంటాయి.  ఫండ్ అనుకూలత గురించి అనిశ్చితంగా ఉన్న పెట్టుబడిదారులు వారి ఆర్థిక సలహాదారుల నుండి సలహా తీసుకోవాలి.

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను