అవును! చిన్న పొదుపులతో లేదా చిన్న ప్రారంభాలు ఉన్న ఒక ఇన్వెస్టర్‌కైనా, మ్యూచువల్ ఫండ్స్ ఒక ఆదర్శ పెట్టుబడి వాహనంగా ఉంటాయి.
దాదాపు ప్రతి ఇన్వెస్టర్, చిన్న లేదా పెద్ద, ఒక సేవింగ్స్ బ్యాంక్ (ఎస్బి) అకౌంట్ కలిగి ఉంటారు మరియు ఆ అకౌంట్‌తో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ప్రతి నెల రూ 500 అంత తక్కువలో, మ్యూచువల్ ఫండ్స్ క్రమంగా పెట్టుబడి పెట్టె ఆరోగ్యకరమైన అలవాటును ప్రోత్సహిస్తాయి.
చిన్న పెట్టుబడిదారునికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇతర ప్రయోజనాలు-
- సులువుగా లావాదేవీ జరపడం- పెట్టుబడి పెట్టడం, సమీక్షించడం, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము నిర్వహించడం మరియు వాటి నుండి రిడీమ్ చేయడం అన్నీ సులువైన ప్రక్రియలు.
- సులువైన లిక్విడిటీ, గరిష్ట పారదర్శకత మరియు వెల్లడి, సమయానుసారంగా అకౌంట్ స్టేట్మెంట్లు మరియు పన్ను ప్రయోజనాలు చిన్న లేదా మొదటిసారి పెట్టుబడి చేసే వారు చూసుకునేవి.
- మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్లు పెట్టుబడిదారు చేతిలో పన్ను రహితంగా ఉంటాయి
- రూ 500 పెట్టుబడి పెట్టిన వారికి లేదా రూ 5 కోట్లు పెట్టుబడి పెట్టిన వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒకే రకమైన పెట్టుబడి పనితీరుని ఇస్తాయి. అలా ప్రతి చిన్నా లేదా పెద్ద -పెట్టబడిదారుని వడ్డీలను దృస్టిలో పెట్టుకుంటుంది.
- ప్రొఫెషనల్లీ మేనేజ్డ్, వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నెలకు రూ 500 కూడా ఇన్వెస్ట్ చేసే వారి కొరకు.
ప్రారంభ మొత్తం ఎంత చిన్నదైనా లేదా చిన్న ఉద్దేశ్యాలతో నిమిత్తం లేకుండా, మ్యూచువల్ ఫండ్స్ సరైనవి.
400