నేను ఒక మ్యూచువల్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

నేను ఒక మ్యూచువల్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ట్రావెల్ ఏజెంటుని, “రవాణా పద్ధతిని నేను ఎలా ఎంపిక చేసుకోవాలి? అని అడగడం ఊహించుకోండి” అతను/ఆమె ముందుగా అంటారు “మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో దానిని బట్టి ఉంటుంది.” నేను 5 కిమీ దూరం ప్రయాణించాలనుకుంటే, ఆటోరిక్షా ఉత్తమమైన ఎంపిక కావచ్చు, కాగా న్యూఢిల్లీ నుండి కొచ్చికి, బహుశా ఫ్లైట్ ఉత్తమం కావచ్చు. తక్కువ దూరానికి ఫ్లైట్ అందుబాటులో ఉండదు మరియు సుదూర ప్రయాణానికి ఆటోరిక్షా చాలా అసౌకర్యంగా ఉంటుంది మరియు నిదానం అయినది.

మ్యుచువల్ ఫండ్స్‌లో కూడా, ప్రారంభ బిందువు- మీ అవసరాలు ఏవి?

ఇది మీ ఆర్థిక లక్షాలు మరియు రిస్క్ స్వభావం‌తో ప్రారంభమవుతుంది.

మీరు మీ ఆర్థిక లక్ష్యాలను ముందుగా గుర్తించాలి. కొన్ని మ్యూచువల్‌ ఫండ్ స్కీములు స్వల్పకాల అవసరాలు లేదా లక్ష్యాలకు సరిపోతాయి, కాగా కొన్ని దీర్ఘ కాల లక్ష్యాల కొరకు చక్కనివి.

తరువాత రిస్క్ అపెటైట్ వస్తుంది. విభిన్న వ్యక్తులకు విభిన్న రిస్క్ స్వభావం ఉంటుంది. భార్యాభర్తలలొ కూడా సంయుక్తంగా ఫైనాన్సులు ఉండవచ్చు కానీ విభిన్న రిస్కు ప్రొపైల్స్ ఉండవచ్చు. కొన్ని అధిక రిస్క్ ఉత్పత్తులలో సౌకర్యవంతంగా ఉంటాయి, కాగా కొన్నిటికి అలా ఉండవు.

మీ రిస్క్ ఎదుర్కోగల స్థాయిని మదింపు చేసేందుకు, పెట్టుబడి సలహాదారులు లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు వంటి ఆర్థిక నిపుణుల నుండి సహాయాన్ని మీరు పొందవచ్చు.

402
402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను