ఇండెక్స్ ఫండ్లు అంటే ఏమిటి?

ఇండెక్స్ ఫండ్లు అంటే ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఇండెక్స్ ఫండ్‌లు నిష్క్రియాత్మక మ్యూచువల్ ఫండ్లు, అవి ప్రసిద్ధ మార్కెట్ సూచీలను అనుకరిస్తాయి. ఫండ్ యొక్క పోర్ట్‌ఫోలియోను నిర్మించేందుకు పరిశ్రమలు మరియు స్టాకులను ఎంచుకోవడంలో ఫండ్ నిర్వాహకుడు ఒక చురుకైన పాత్రను పోషించడు అయితే అనుసరించవలసిన సూచీని రూపకల్పన చేసే అన్నీ స్టాకులలో పెట్టుబడి చేసేస్తాడు. సూచీలోని ప్రతి స్టాక్ యొక్క వెయిటేజీకి ఫండ్‌లోని స్టాకుల వెయిటేజీ చాలాదగ్గరగా మ్యాచ్ అవుతుంది. ఇది నిష్క్రియాత్మక పెట్టుబడి అంటే, ఫండ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించేటప్పుడు ఫండ్ నిర్వాహకుడు సూచీని యధావిధిగా నకలు చేసి, అన్నీ వేళలా పోర్ట్‌ఫోలియోను దాని సూచీతో కలిపి నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటాడు.

సూచీలోని ఒక స్టాక్ వెయిటేజీ మారితే, సదరు సూచీతో సరిసమానంగా పోర్ట్‌ఫోలియోలో దాని వెయిట్‌ను కలిగి ఉండేందుకు స్టాక్ యూనిట్లను ఫండ్ నిర్వాహకుడు తప్పక కొనాలి లేదా అమ్మాలి. నిష్క్రియ యాజమాన్యాన్ని అనుసరించడం తేలికగా ఉండగా, ట్రాకింగ్ లోపం కారణంగా సూచీతో సమానమైన రాబడులను ఫండు ఎల్లప్పుడూ ఇవ్వదు.

సూచీ యొక్క సెక్యూరిటీలను అదే పాళ్ళలో ఉంచడం ఎప్పుడూ సాధ్యపడదు మరియు అలా చేసేందుకు లావాదేవీ ఖర్చులు ఫండ్‌ మీద మోపబడతాయి కనక ట్రాకింగ్ లోపం ఏర్పడుతుంది. ట్రాకింగ్ లోపం ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్‌లో లేదా వ్యక్తిగత స్టాక్స్‌లో పెట్టుబడి చేసే రిస్కును తీసుకోవద్దనుకునే వారికి అయితే విస్తార మార్కెట్‌కు బహిర్గతమై, దాని ద్వారా నేర్చుకోవాలనుకునే వారికి ఇండెక్స్ ఫండ్‌లు సరైనవి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను