లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్
ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు చేయవలసిన నెలవారీ SIP పెట్టుబడులను నిర్ధారిస్తుంది.
నెలవారీ SIP మొత్తము₹0
మీ యొక్క మొత్తం పెట్టుబడి₹0
నెలవారీ SIP మొత్తము₹0
మీ యొక్క మొత్తం పెట్టుబడి₹0
డిస్క్లైమర్
- గతంలో ప్రదర్శించిన పనితీరు భవిష్యత్తులో కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చు మరియు ఇది భవిష్య రాబడులకు హామీ కాదు.
- దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.
- మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.
- మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
ఇతర క్యాలిక్యులేటర్లు

మీ యొక్క నెలవారీ SIP పెట్టుబడుల యొక్క భవిష్య విలువను కనుక్కోండి.

మీ ప్రస్తుత పెట్టుబడిని పరిగణించి, అవసరమైన SIP లేదా ఏకమొత్తాన్ని లెక్కించడం ద్వారా మీ ఆర్ధిక లక్ష్యాన్ని రూపొందించుకోండి.

మీ నగదు మీద ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) యొక్క ప్రభావాన్ని లెక్కించండి. ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) దృష్ట్యా మీ ప్రస్తుత ఖర్చులను తీర్చుకునేందుకు భవిష్యత్తులో మీకు ఎంత నగదు అవసరమవుతుందో కనుక్కోండి.

మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీ రాబడిపై ఉండే ప్రభావాన్ని లెక్కించడాన్ని పరిగణించండి.
గురించి మరింత తెలుసుకోండి గోల్ SIP
క్యాలిక్యులేటర్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు




ఎక్కువ శాతం పెట్టుబడిదారులు తమ పెట్టుబడి ప్రయాణన్ని ప్రారంభించే ముందు నిర్ణీత కాలవ్యవధిలో కొంత మొత్తంలో సంపదను సృష్టించడమే లక్ష్యంగా చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ పరంగా - పెట్టుబడిదారుడు ప్రతి నెల పెట్టుబడి పెట్టాల్సిన SIP మొత్తాన్ని మరియు పెట్టుబడి పెట్టాల్సిన కాల వ్యవధిని నిర్ణయించవచ్చు.
ఈ SIP ఇన్వెస్ట్‌మెంట్ విశ్లేషణ కోసం - పెట్టుబడిదారులు లక్ష్య ఆధారంగా SIP క్యాలిక్యులేటర్‌ను నిరాటంకంగా ఉపయోగించవచ్చు.
లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?
లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్ అనేది సులభంగా ఉపయోగించగల ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ లేదా సాధనం, ఇది మెచ్యూరిటీ విలువ (సంపద సేకరణ లక్ష్యం) గురించి మీరు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ సాధనాన్ని మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ముందే ఉపయోగించవచ్చు.
ఈ సాధనం మీరు అందించే టార్గెట్ కార్పస్, కాలపరిమితి మరియు రాబడి రేటు వంటి సమాచారంతో ఫలితాన్ని లెక్కించే ప్రీ-ప్రోగ్రామ్డ్ అల్గోరిథం ద్వారా పనిచేస్తుంది. అయితే, ఎస్‌ఐపి (SIP) క్యాలిక్యులేటర్ అనేది మీరు అందించే ఇన్‌పుట్ ఆధారంగా పెట్టుబడి యొక్క కల్పిత భవిష్యత్తు విలువను అంచనా వేస్తుంది మరియు మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడిదుడుగులకు లోబడి ఉంటుంది కావున దీనికి హామీ ఇవ్వలేము. అందువల్ల, దీనిని ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేటర్ అని కూడా అంటారు.
లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?
ఎస్‌ఐపి (SIP) క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి సరళమైనది, ఇది మీరు నమోదు చేసిన డేటా పాయింట్ల ద్వారా మీకు SIP విలువను ఇస్తుంది. మీరు ఈ క్రింద వివరించిన దశల ద్వారా లక్ష్య ఆధారిత ఎస్‌ఐపి (SIP) క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు:
స్టెప్ 1: మీ SIP పెట్టుబడి ద్వారా మీరు చేరుకోవాలనుకుంటున్న లక్ష్య మొత్తాన్ని నమోదు చేయండి.
స్టెప్ 2: పెట్టుబడి వ్యవధిని ఎంచుకోండి.
స్టెప్ 3: సంవత్సరానికి ఆశించిన రాబడి రేటును (%) ఇన్‌పుట్ చేయండి.
మీ మొత్తం పెట్టుబడి మరియు మీరు పెట్టుబడి పెట్టాల్సిన నెలవారీ SIP మొత్తాన్ని మీరు చూడవచ్చు.
ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలవారీ SIP మొత్తం మరియు పెట్టుబడి కాలపరిమితిని నిర్ణయించడం చాలా ముఖ్యం, ఈ క్యాలిక్యులేటర్ ఈ వైపుగా మిమ్మల్ని నావిగేట్ చేయగలదు.
లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల కలిగే ఉపయోగాలు
లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే:
1. ఇది ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేటర్: ఈ లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్ మీకు పెట్టుబడి యొక్క భవిష్యత్తు విలువలను అందిస్తుంది, మరింత క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
2. ఇది మాన్యువల్ లెక్కింపులు లేకుండా మీ సమయాన్ని ఆదా చేస్తుంది: ఒక నిర్దిష్ట మెచ్యూరిటీ మొత్తాన్ని చేరుకోవడానికి మీరు ప్రతి నెల SIP పద్ధతులలో ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి అనే దానిపై మాన్యువల్గా లెక్కించడం సమయంతో కూడుకున్నది. ఈ క్యాలిక్యులేటర్ మీకు శీఘ్ర పరిష్కారాన్ని అందిస్తుంది.
3. ఇది మానవ దోషాన్ని నివారిస్తుంది: మాన్యువల్ లెక్కింపు సమయంలో జరిగే సాధారణ తప్పులను లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్ వాడకంతో నివారించవచ్చు.
4. ఇది పెట్టుబడి ప్రణాళికను నిర్ణయించడానికి మరియు వ్యూహలు వేయడానికి సహాయపడుతుంది: ఒక అంచనా విలువను చేరుకోవడానికి మీరు ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకున్నప్పుడు, తదనుగుణంగా మీ పెట్టుబడులను వ్యూహలను వేయడానికి మరియు ప్రణాళికను నిర్ణయించడానికి ఇది మీకు సహాయపడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ సాధనం, ఇది పెట్టుబడిదారులు లక్ష్యంగా చేసుకున్న మెచ్యూరిటీ మొత్తానికి SIP లుగా ఎంత పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.