రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్
మీ ఖర్చుల ఆధారంగా మీకు అవసరమైన రిటైర్మెంట్ నిధిని అంచనా వేయండి, దాన్ని సాధించడానికి అవసరమైన నెలవారీ పెట్టుబడిని కూడా గణించండి.
రిటైర్మెంట్ తర్వాత అవసరం అయ్యే మొత్తం కార్పస్ విలువ₹0
రిటైర్మెంట్ తర్వాత వెంటనే అవసరం అయ్యే వార్షిక ఆదాయం
₹0
కార్పస్‌ను సమకూర్చుకోవడానికి అవసరం అయ్యే నెలవారీ పొదుపులు
₹0
డిస్క్లైమర్
- గతంలో ప్రదర్శించిన పనితీరు భవిష్యత్తులో కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చు మరియు ఇది భవిష్య రాబడులకు హామీ కాదు.
- దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.
- మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.
- మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
ఇతర క్యాలిక్యులేటర్లు

ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు చేయవలసిన నెలవారీ SIP పెట్టుబడులను నిర్ధారిస్తుంది.

మీ ప్రస్తుత పెట్టుబడిని పరిగణించి, అవసరమైన SIP లేదా ఏకమొత్తాన్ని లెక్కించడం ద్వారా మీ ఆర్ధిక లక్ష్యాన్ని రూపొందించుకోండి.

మీ నగదు మీద ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) యొక్క ప్రభావాన్ని లెక్కించండి. ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) దృష్ట్యా మీ ప్రస్తుత ఖర్చులను తీర్చుకునేందుకు భవిష్యత్తులో మీకు ఎంత నగదు అవసరమవుతుందో కనుక్కోండి.

మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీ రాబడిపై ఉండే ప్రభావాన్ని లెక్కించడాన్ని పరిగణించండి.
రిటైర్మెంట్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోండి
క్యాలిక్యులేటర్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు




MFSH రిటైర్మెంట్ ప్లాన్క్యా లిక్యులేటర్
ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ ప్లాన్ చాలా అవసరం. రిటైర్మెంట్ ప్లానింగ్ రూపొందించే ప్రక్రియలో ఆదాయ వనరులను గుర్తించడం, సమర్థవంతమైన పొదుపు స్కీమ్‌ను గుర్తించడం, అవసరమయ్యే నిధులను అంచనా వేయడం మరియు మీ ఆదాయంలో కొంత భాగాన్ని వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టడం వంటి అనేక కీలక దశలు ఉంటాయి.
అయితే, దృఢమైన రిటైర్మెంట్ జీవితం కోసం ఖచ్చితమైన లెక్కింపులను చేయడం మరియు మీ పెట్టుబడుల నుండి రాబడిని అంచనా వేయడం అనేది ఒక సవాలుగా నిలుస్తుంది. రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ అనేది వ్యక్తులకు రిటైర్మెంట్ కోసం అవసరమైన కార్పస్‌ను అంచనా వేయడానికి మరియు దానిని సాధించడానికి వారు ఎంత పొదుపు చేయలి లేదా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తాన్ని నిర్ణయించడానికి సహాయపడుతుంది.
రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏమిటి?
రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది రిటైర్మెంట్ కోసం సరైన ఆర్థిక స్థితిని సిద్ధం చేయడం. రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసేటప్పుడు, మీరు ద్రవ్యోల్బణాన్ని రిటైర్మెంట్ అనంతర ఖర్చులను, రిటైర్మెంట్ కాలపరిమితిని, నష్టాలను అంచనా వేయడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి మరియు తెలివిగా పెట్టుబడులను పెట్టాలి.
అంతేకాకుండా, ఆయుర్దాయం పెరుగుతున్నందున, మీరు ఉద్యోగం నుండి రిటైర్మెంట్ అయిన తర్వాత సురక్షితమైన ఆర్థిక అవసరం చాలా అవసరం. మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అందించే రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్, రిటైర్మెంట్ తర్వాత మీకు అవసరమైన నిధుల మొత్తాన్ని మరియు రిటైర్మెంట్‌కు ముందు మరియు తరువాత పెట్టుబడులపై మీరు పొందగల రాబడిని అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది.
MFSH రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?
MFSH రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ అనేది మీ రిటైర్మెంట్ తర్వాత మీకు ఎంత డబ్బు అవసరమో చూపించే ఆన్‌లైన్ యుటిలిటీ టూల్. మీరు సమకూర్చుకోవలసిన రిటైర్మెంట్ కార్పస్ ఆధారంగా మీ పెట్టుబడిని ప్రణాళిక వేయడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది.
ఇది రెండు ప్రాథమిక మార్గాలలో ఉపయోగపడుతుంది మరియు అవి:
1. మీరు జీవిస్తున్న ప్రస్తుత జీవనశైలిని కొనసాగించడానికి మీ రిటైర్మెంట్ తర్వాత మీకు అవసరమైన డబ్బును ఇది మీకు చూపుతుంది.
2. ఇది మీ పెట్టుబడులపై రాబడులను అంచనా వేయడానికి మరియు మీ రిటైర్మెంట్ కార్పస్‌ను సమకూర్చుకోవడానికి మీరు ఎలా పెట్టుబడి పెట్టాలో అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది.
రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?
MFSH రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్‌లో ఒక ఫార్ములా బాక్స్ ఉంటుంది, ఇక్కడ మీరు మీ ప్రస్తుత వయస్సు, మీ రిటైర్మెంట్ వయస్సు, ఆయుర్దాయం మరియు రిటైర్మెంట్ తర్వాత అవసరమైన నెలవారీ ఆదాయాన్ని ఇన్‌పుట్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. అంచనా ద్రవ్యోల్బణ రేటు, పెట్టుబడిపై ఆశించిన రాబడి, మీకు ప్రస్తుత పొదుపు ఏమైనా ఉందా అనే అంశాలను కూడా మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఈ వివరాలను ఇన్‌పుట్ చేసిన తర్వాత, క్యాలిక్యులేటర్ మీకు రిటైర్మెంట్ సమయంలో అవసరమైన వార్షిక ఆదాయం మరియు ఈ కార్పస్‌ను సమకూర్చుకోవడానికిమీరు చేయవలసిన నెలవారీ పొదుపును చూపుతుంది.
MFSH రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?
మీరు ఈ క్యాలిక్యులేటర్‌ను కొన్ని దశలలో మాత్రమే ఉపయోగించవచ్చు మరియు ఆ దశలు క్రింద జాబితా చేయబడ్డాయి:
దశ 1: మీ ప్రస్తుత వయస్సును నమోదు చేయండి.
దశ 2: మీరు కోరుకున్న రిటైర్మెంట్ వయస్సును నమోదు చేయండి.
దశ 3: మీ ఆయుర్దాయాన్ని ఎంచుకోండి.
దశ 4: మీ రిటైర్మెంట్ సంవత్సరాలలో మీకు అవసరమైన నెలవారీ ఆదాయాన్ని నమోదు చేయండి.
దశ 5: దేశంలో అంచనా ద్రవ్యోల్బణ రేటును నమోదు చేయండి.
దశ 6: రిటైర్మెంట్‌కు ముందు పెట్టుబడులపై ఆశించిన రాబడిని నమోదు చేయండి.
దశ 7: రిటైర్మెంట్ తర్వాత పెట్టుబడులపై ఆశించిన రాబడులను నమోదు చేయండి.
దశ 8: రిటైర్మెంట్ కోసం కేటాయించిన ప్రస్తుత పొదుపు లేదా పెట్టుబడులను ఇన్‌పుట్ చేయండి.
ఈ వివరాలను అందించగానే, క్యాలిక్యులేటర్ డిస్‌ప్లే పై వీటిని చూడవచ్చు:
- రిటైర్మెంట్ తర్వాత అవసరమైన వార్షిక ఆదాయం.
- సమకూర్చుకోవాల్సిన అదనపు నగదు.
- అవసరమైన కార్పస్‌ను సమకూర్చుకోవడానికి అవసరం అయ్యే నెలవారీ పొదుపు వివరాలు.
MFSH రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు
రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రాథమిక ప్రయోజనాలు:
ఇది రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడానికి సహాయపడుతుంది: రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం 20, 30 ఏళ్ల వయస్సులోనే ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. క్యాలిక్యులేటర్, వ్యక్తులకు అవసరమైన నిధులు మరియు నిర్ణీత కాలవ్యవధిలో వాటిని ఎలా సమకూర్చుకోవాలో తెలియజేయడం ద్వారా ముందస్తు పొదుపు మరియు పెట్టుబడుల అవసరాన్ని తెలుపుతుంది.
రిటైర్మెంట్ తరువాత అవసరమైన అంచనా నగదును తెలుసుకోవడానికి సహాయపడుతుంది: మీ రిటైర్మెంట్ తరువాత మీకు ఖచ్చితంగా ఎంత అవసరమో అంచనా వేయడం కష్టం, మరియు ఈ క్యాలిక్యులేటర్ ఈ అంచనాను అప్రయత్నంగా పూర్తి చేస్తుంది. అంతేకాకుండా, అవసరమైన కార్పస్‌ను నిర్ణీత కాలవ్యవధిలో సమకూర్చుకోవడానికి మీరు ప్రస్తుతం పెట్టవలసిన పెట్టుబడులు లేదా చేయవలసిన పొదుపు మొత్తాన్ని ఇది మీకు తెలియజేస్తుంది.
రిటైర్మెంట్‌లో అదనపు ఖర్చుల కోసం ప్రణాళిక వేయడానికి ఇది సహాయపడుతుంది: మీ రిటైర్మెంట్ తర్వాత అదనపు ఖర్చులు ఉంటే, మీరు దాని కోసం ముందుగానే ప్లాన్ చేయవచ్చు మరియు సిద్ధంగా ఉండవచ్చు, ఎందుకంటే మీకు ఇప్పటికే రిటైర్మెంట్ జీవిత ఖర్చులు తెలుసు.
తరచుగా అడిగే ప్రశ్నలు
MFSH రిటైర్మెంట్ ప్లాన్ క్యాలిక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ సాధనం, ఇది పదవీ విరమణ తర్వాత మీ జీవితానికి అవసరమైన కార్పస్ మొత్తాన్ని అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది.