స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్
మీరు మీ SIP ని క్రమం తప్పకుండా కొంత శాతం పెంచినప్పుడు, మీ SIP పెట్టుబడుల భవిష్యత్తు విలువను లెక్కించండి.
పెట్టుబడి మొత్తం₹0
అంచనా రాబడులు
₹0
మొత్తం విలువ (స్టెప్-అప్‌తో)
₹0
మొత్తం విలువ (స్టెప్-అప్ లేకుండా)
₹0
వ్యత్యాసం
₹0
డిస్క్లైమర్
- గతంలో ప్రదర్శించిన పనితీరు భవిష్యత్తులో కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చు మరియు ఇది భవిష్య రాబడులకు హామీ కాదు.
- దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.
- మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.
- మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
ఇతర క్యాలిక్యులేటర్లు

ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు చేయవలసిన నెలవారీ SIP పెట్టుబడులను నిర్ధారిస్తుంది.

మీ ప్రస్తుత పెట్టుబడిని పరిగణించి, అవసరమైన SIP లేదా ఏకమొత్తాన్ని లెక్కించడం ద్వారా మీ ఆర్ధిక లక్ష్యాన్ని రూపొందించుకోండి.

మీ నగదు మీద ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) యొక్క ప్రభావాన్ని లెక్కించండి. ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) దృష్ట్యా మీ ప్రస్తుత ఖర్చులను తీర్చుకునేందుకు భవిష్యత్తులో మీకు ఎంత నగదు అవసరమవుతుందో కనుక్కోండి.

మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీ రాబడిపై ఉండే ప్రభావాన్ని లెక్కించడాన్ని పరిగణించండి.
స్టెప్-అప్ SIP గురించి మరింత తెలుసుకోండి
క్యాలిక్యులేటర్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు




స్టెప్-అప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే ఏమిటి?
స్టెప్-అప్ SIPలో, కాలక్రమేణా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను క్రమంగా పెంచడం ఉంటుంది. స్థిర క్రమానుగత వాయిదాలతో ఉండే సాధారణ SIPల విధంగా కాకుండా, స్టెప్-అప్ SIPలు క్రమంగా కంట్రిబ్యూషన్‌లను పెంచడానికి, ఆదాయం మరియు ఆర్థిక లక్ష్యాలలో మార్పులకు సర్దుబాటు చేయడానికి పెట్టుబడిదారులను అనుమతిస్తాయి. SIP మొత్తాలను పెంచడం అనేది, ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి, భవిష్య పెట్టుబడి విలువలను అంచనా వేయడానికి మరియు వారి లక్ష్యాలను చేరుకోవడానికి, ఉత్తమ వార్షిక ఇంక్రిమెంట్‌లను గుర్తించడానికి పెట్టుబడిదారులు స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?
స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ అనేది పెట్టుబడిదారులు తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) భవిష్య విలువను అంచనా వేయడంలో సహాయపడటానికి రూపొందించబడిన సులభమైన సాధనం. దీనిని ఉపయోగించడం ద్వారా, పెట్టుబడిదారులు SIP ప్రాధాన్యతలు మరియు ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే తగిన వార్షిక ఇంక్రిమెంట్‌ను నిర్ణయించవచ్చు.
ఉదాహరణకు, మీరు 2020లో నెలకు రూ.10,000 ప్రారంభ SIP పెట్టుబడితో ప్రారంభించారనుకుందాం. స్టెప్-అప్ SIP ప్లాన్‌తో, మీరు మీ నెలవారీ SIP కంట్రిబ్యూషన్‌ను ప్రతి సంవత్సరం 5% పెంచాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి, 2021లో, మీ SIP కంట్రిబ్యూషన్ నెలకు రూ. 10,500 అవుతుంది. 2022లో నెలకు రూ. 11,025 అవుతుంది. ఈ వ్యూహం మీ ప్రస్తుత ఆదాయం, అంచనా వేయబడిన వార్షిక పెరుగుదల మరియు ఆర్థిక లక్ష్యాల ఆధారంగా రూపొందించబడింది.
స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ వినియోగించి, ఈ ఇంక్రిమెంటల్ కంట్రిబ్యూషన్‌లతో మీ పెట్టుబడులు కాలక్రమేణా ఎలా పెరుగుతాయో మీరు ప్లాన్ మరియు విజువలైజ్ చేయవచ్చు. ఈ విధంగా మీ పెట్టుబడుల గురించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మార్కెట్ రిస్క్లకు లోబడి మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.
స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?
మ్యూచువల్ ఫండ్స్ సహీ హై (MFSH) స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి, అవసరమైన వివరాలను ఇన్‌పుట్ చేయండి! ఇది ప్రారంభకులకు కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా రూపొందించబడింది.
a. ప్రారంభ నెలవారీ SIP పెట్టుబడి మొత్తం
b. SIP వ్యవధి (సంవత్సరాల్లో)
c. పెట్టుబడిపై ఆశించిన రాబడి రేటు
d. నెలవారీ SIP కొరకు వార్షిక శాతం పెరుగుదల మొత్తం
ఈ వివరాలను అందించిన తర్వాత, క్యాలిక్యులేటర్ మీ SIP పెట్టుబడి అంచనా భవిష్య విలువను లెక్కిస్తుంది, ఇది ఆర్థిక ప్రణాళిక మరియు లక్ష్య సెట్టింగ్‌కు సహాయపడుతుంది.
స్టెప్-అప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ రాబడులను లెక్కించడానికి ఫార్ములా
మీ స్టెప్-అప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) తుది విలువ మీ పెట్టుబడుల మార్కెట్ పనితీరు ద్వారా ప్రభావితమవుతుంది. ఏదేమైనా, స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ భవిష్య విలువను లెక్కించడానికి ఈ ఫార్ములాని ఉపయోగిస్తుంది:
భవిష్య విలువ (FV) = P * [(1 + r/n)^(nt) – 1 / (r/n)] + (S * [(1 + r/n)^(nt) – 1 / (r/n)])
ఇక్కడ:
P: ప్రారంభ పెట్టుబడి
r/n: రాబడి రేటు
nt: కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ
S: నెలవారీ SIP కోసం వార్షిక పెరుగుదల మొత్తం
దిగువ పేర్కొన్న విలువలతో స్టెప్-అప్ SIP లో పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడుతున్నట్టు పరిగణిద్దాం:
- ప్రారంభ పెట్టుబడి మొత్తం: రూ. 5,000
- పెరుగుదల రేటు: 10%
- పెట్టుబడి వ్యవధి: 10 సంవత్సరాలు
- ఆశించిన రాబడి రేటు: 12%
అతడి/ఆమె పెట్టుబడి అంచనా రాబడులు ఇలా ఉంటాయి:
- పెట్టుబడి మొత్తం: రూ. 9,56,245
- అంచనా రాబడులు: రూ. 7,30,918
- మొత్తం విలువ: రూ. 16,87,163
MFSH స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్‌ని ఎలా ఉపయోగించాలి?
MFSH స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ ఉపయోగించడం అనేది కొన్ని సాధారణ దశలతో కూడిన సరళమైన ప్రక్రియ. అవి:
స్టెప్ 1: ఫండ్ కోసం నెలవారీ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని MFSH స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్‌లో ఇన్‌పుట్ చేయండి.
స్టెప్ 2: మ్యూచువల్ ఫండ్ స్టెప్-అప్లి క్యాక్యులేటర్‌లో పెట్టుబడి మెచ్యూరిటీకి కావలసిన కాలపరిమితి లేదా వ్యవధిని పేర్కొనండి.
స్టెప్ 3: క్యాలిక్యులేటర్‌లో అంచనా వడ్డీ మరియు స్టెప్-అప్ శాతాలను నింపండి.
స్టెప్ 4: అన్ని ఫీల్డ్‌లు ఖచ్చితంగా నింపబడ్డాయని ధృవీకరించుకోండి.
స్టెప్ 5: ఫలితాలను జనరేట్ చేయడానికి 'క్యాలిక్యులేట్' బటన్‌పై క్లిక్ చేయండి.
అప్పుడు మీరు మీ పెట్టుబడి ప్రణాళిక కోసం అందించిన అంతర్దృష్టులను ఉపయోగించుకోవచ్చు.
MFSH స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. లక్ష్యం-ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్
స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు ఉన్న వ్యక్తులకు స్టెప్-అప్ SIPలు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి. స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్‌తో, పెట్టుబడిదారులు ఈ లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడానికి వారి పెట్టుబడులను అనుకూలీకరించవచ్చు.
2. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి
స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ ఇంక్రిమెంట్ ప్రక్రియను ఆటోమేట్ చేయడం ద్వారా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. ఇది మాన్యువల్ పర్యవేక్షణ మరియు సర్దుబాట్ల అవసరాన్ని తొలగిస్తుంది, పెట్టుబడిదారులు వారి ఆర్థిక లక్ష్యాల పట్ల వారి నిబద్ధతలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది.
3. వశ్యత మరియు అనుకూలీకరణ
స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ మారుతున్న ఆర్థిక పరిస్థితుల ఆధారంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడి మొత్తాలను సర్దుబాటు చేసే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది ఆదాయ వృద్ధిని ఆశించే లేదా నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలను కలిగి ఉన్న వ్యక్తులకు సేవలందిస్తుంది, తదనుగుణంగా వారి పెట్టుబడులను రూపొందించడానికి వారిని అనుమతిస్తుంది.
4. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గిస్తుంది
ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గిస్తుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెట్టుబడి మొత్తాలను నిర్ధారించడం ద్వారా ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కోవటానికి స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్ సహాయపడుతుంది. పెట్టుబడులను కాలానుగుణంగా పెంచడం ద్వారా, పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల విలువను కాపాడుకోవచ్చు మరియు ద్రవ్యోల్బణం ప్రతికూల ప్రభావాల నుండి రక్షించవచ్చు.
FAQలు
మ్యూచువల్ ఫండ్ కంట్రిబ్యూషన్‌లను క్రమంగా పెంచడానికి స్టెప్-అప్ SIPలు అనువైన విధానాన్ని అందిస్తాయి. సాంప్రదాయ SIPల విధంగా కాకుండా, స్టెప్-అప్ SIPలు మారుతున్న ఆర్థిక పరిస్థితులు మరియు లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి మొత్తాలకు ఇంక్రిమెంటల్ సర్దుబాట్లను అనుమతిస్తాయి. స్టెప్-అప్ SIPల అనుకూలత వ్యక్తిగత పెట్టుబడిదారుని అవసరాలు మరియు ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.