నేను ELSS లో పెట్టుబడి, SIP ద్వారా పెట్టాలా లేదా ఏకమొత్తంలో పెట్టాలా?

నేను ELSS లో పెట్టుబడి, SIP ద్వారా పెట్టాలా లేదా ఏకమొత్తంలో పెట్టాలా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ELSS లో SIP ద్వారా లేదా ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవడం అనేది మీరు ఎప్పుడు మరియు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగింపులో పన్ను ఆదా చేయడానికి మీరు చూస్తున్నట్లయితే, ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టడం ఒక్కటే మీకున్న ఎంపిక. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీరు పెట్టుబడి పెడుతుంటే, మీరు ఏకమొత్తంగా గానీ లేదా SIP ద్వారా గానీ పెట్టుబడి పెట్టవచ్చు. ELSS పన్ను ప్రయోజనం మరియు ఈక్విటీల పెరుగుదలను కూడా అందిస్తుంది.

ELSS లో SIP ద్వారా పెట్టుబడి పెట్టడంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, మీరు మీ పెట్టుబడులను సంవత్సరమంతా విస్తరించడం ద్వారా రిస్క్ తగ్గించుకుంటారు. రెండోది, రూపాయి-ధర సరాసరి కారణంగా ఒకేసారి ఒకే దగ్గర ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడంతో పోలిస్తే సంవత్సరానికి వేరువేరు NAV లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ యూనిట్లకు మెరుగైన సగటు ధరను పొందవచ్చు. మూడోది, ఏకమొత్తం పెట్టుబడి పెట్టడంతో పోలిస్తే చిన్న మొత్తాలుగా పెట్టే రెగ్యులర్ పెట్టుబడులు మీ జేబుకు చిల్లులు పడనివ్వవు, కానీ సంవత్సరమంతా పెట్టిన పెట్టుబడి మొత్తం మీరు ELSS కోసం కేటాయించాలనుకున్నదానితో సమానంగా ఉందని మీరు నిర్ధారించుకోవాలి.

ELSS ఫండ్స్‌కు 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉన్నందున, ఏకమొత్తం పెట్టుబడి పెట్టిన  సందర్భంలో మీరు ఈరోజు పెట్టుబడి పెడితే మీ డబ్బును మీరు 3 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకోగలరు. ప్రతీ SIP చెల్లింపుకు కూడా లాక్-ఇన్ పీరియడ్ వర్తిస్తుంది. 12 నెలలలో పెట్టిన పెట్టుబడి పెట్టిన పూర్తి సొమ్ము మీరు విత్‌డ్రా చేయాలనుకుంటే, చివరి SIP ఇన్‌స్టాల్‌మెంట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు మీరు వేచి ఉండాలి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను