మ్యూచువల్‌ ఫండ్ పనితీరుని ఏవి ప్రభావితం చేస్తాయి?

మ్యూచువల్‌ ఫండ్ పనితీరుని ఏవి ప్రభావితం చేస్తాయి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ప్రతి మ్యూచువల్‌ ఫండ్ స్కీముకు ఇన్వెస్ట్‌మెంట్ ఉద్దేశ్యం ఉంటుంది మరియు నియమిత ఫండ్ మేనేజర్, ఆ ఉద్దేశ్యాన్ని సాధించడానికి ఫండ్ అనుకూలంగా పనిచేయడానికి బాధ్యులైనవారి, వారి ద్వారా నిర్వహించబడుతుంది.

MF స్కీం ని ప్రభావితం చేయగల ఫండ్, నిర్వాహక సిబ్బంది తీసుకునే నిర్ణయాలు, క్యాపిటల్ మార్కెట్ లోని వివిధ దశలు, వ్యాపార మరియు ఆర్థిక పరిస్థితులు, సంబంధిత సూక్ష్మ మరియు స్థూల ఆర్థిక కారకాలు మొదలైనటువంటి వాటి వలన ఈ పెర్ఫార్మెన్స్ ప్రభావితం అవుతుంది. స్కీం సమాచార పత్రంలో నిర్వచించిన విధంగా పోర్ట్ఫోలియోలోని సెక్యూరిటీల ఎంపికను నియంత్రించే ఒక ప్రక్రియ ఫండ్ నిర్వాహక సిబ్బంది వద్ద ఉంటుంది.  వివిధ వాణిజ్య పరిస్థితులలో ఈ సెక్యూరిటీల పెర్ఫార్మెన్స్,  స్కీముల పెర్ఫార్మెన్స్ ని అంతిమంగా నిర్దేశిస్తుంది. అందుకే వివిధ లక్ష్యాల కొరకు వివిధ రకాల MF స్కీంలను మీరు ఎంచుకొని, వివిధ కాలవ్యవధుల కొరకు పెట్టుబడి చేసి ఉంచండి. 

ఫండ్ మేనేజిమెంట్ టీములు ధర, నాణ్యత, రిస్కు, న్యూస్ ఫ్లోస్ మరియు ఆర్థిక అభివృద్ధులను బట్టి సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి పాటుపడతాయి. మంచి నైపుణ్యం, బలమైన ప్రాసెస్లు మరియు సంబంధిత అనుభవం చక్కగా పనిచేయాల్సి ఉంటుంది.

అయినప్పటికీ, వాస్తవ కాలవ్యవధుల వద్ద పెర్ఫార్మెన్స్ ని లెక్కించడం ప్రధానం. ఈక్విటీ ఫండ్ల కొరకు దీర్ఘకాలం, హైబ్రిడ్ ఫండ్ల కొరకు మధ్యస్థ వ్యవధి లేదా లిక్విడ్ పండ్ల కొరకు అత్యంత తక్కువ కాలవ్యవధి. 

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు. 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను