గ్రోత్ ఫండ్ అంటే ఏమిటి?
1 నిమిషం 6 సెకన్ల పఠన సమయం

గ్రోత్ ఫండ్ అనేది మూలధన పెరుగుదల కోసం రూపొందించిన ఒక రకమైన పెట్టుబడి స్కీమ్. అందువల్ల దీర్ఘకాలంలో తమ సంపదను పెంచుకోవాలనుకునే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి గ్రోత్ ఫండ్‌ను ఆసక్తికరమైన ఆప్షన్‌గా భావిస్తారు. ఇలాంటి ఫండ్లు ఈక్విటీ షేర్ల విధంగానే వృద్ధి కోసం రూపొందించిన ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి, ఎందుకంటే అవి కాలక్రమేణా విలువ పెరుగుతాయని విశ్వాసం ఉంటుంది. గ్రోత్ ఫండ్స్ క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించడానికి బదులుగా మూలధన లాభాలపై దృష్టి పెడతాయి.
మీరు గ్రోత్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు వాస్తవానికి ఈక్విటీ షేర్ల పోర్ట్ؚఫోలియోను కొనుగోలు చేస్తున్నట్లు, అవి విలువలో మెరుగుదల (పెరుగుదల) ఆశించబడతాయి. సాధారణంగా ఇవి కంపెనీల స్టాక్స్ - ఇవి భవిష్యత్తులో మెరుగవుతాయి లేదా పెరుగుతాయని భావించబడేవి. భవిష్యత్తులో ఈ కంపెనీలు పెరిగే కొద్దీ వాటి షేర్ల ధరలు పెరుగుతాయని, ఫలితంగా గ్రోత్ ఫండ్ విలువ పెరుగుతుందని అంతర్లీనంగా ఉన్న ఆలోచన.
అయితే, గ్రోత్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఓపికగా ఉండి మధ్యస్తం నుంచి దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఈ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులు ఈక్విటీ మార్కెట్ పనితీరుతో ముడిపడి ఉంటాయి, ఇది స్వల్పకాలంలో అస్థిరంగా ఉంటుంది. అసెట్ క్లాస్‌గా ఈక్విటీ దీర్ఘకాలంలో ఇతర రకాల పెట్టుబడులను అధిగమించినప్పటికీ, అటువంటి పెట్టుబడుల విలువ గణనీయమైన హెచ్చుతగ్గులను ముఖ్యంగా తక్కువ కాలవ్యవధిలో కనిపిస్తుంది.
గ్రోత్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలలో పైన పేర్కొన్నవి ఒకటి. గ్రోత్ ఫండ్‌లో అంతర్లీన ఈక్విటీ షేర్ల విలువలు మార్కెట్ సెంటిమెంట్, ఆర్థిక పరిస్థితులు, కంపెనీ పనితీరుతో సహా అనేక విషయాల ద్వారా ప్రభావితమవుతాయి. తత్ఫలితంగా, గ్రోత్ ఫండ్స్ రాబడులు స్వల్పకాలంలో చాలా హెచ్చుతగ్గులకు లోనవుతాయి, ఇది కొన్నిసార్లు మధ్యంతర నష్టాలకు దారితీస్తుంది.
గ్రోత్ ఫండ్లు క్యాపిటల్ అప్రిషియేషన్ ద్వారా సంపద సృష్టికి గొప్ప మార్గం, ప్రత్యేకించి మీకు సుదీర్ఘ పెట్టుబడి వ్యవధి ఉంటే. ఇవి స్వల్పకాలిక అస్థిరత ప్రమాదంతో వస్తాయి, కానీ దీర్ఘకాలికంగా అధిక రాబడిని అందించే సామర్థ్యం మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకోగల పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది.
మీరు స్వల్పకాలిక నష్టాలను చూసి భయపడే అవకాశం ఉన్న వ్యక్తి అయితే, గ్రోత్ ఫండ్స్ మీకు ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. ఏదేమైనా, మీరు ఓపికగల పెట్టుబడిదారు అయితే, మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటే, గ్రోత్ ఫండ్స్ కాలక్రమేణా ప్రతిఫలదాయక పెట్టుబడి కావచ్చు.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.