స్మార్ట్ గోల్ క్యాలిక్యులేటర్
మీ ప్రస్తుత పెట్టుబడిని పరిగణించి, అవసరమైన SIP లేదా ఏకమొత్తాన్ని లెక్కించడం ద్వారా మీ ఆర్ధిక లక్ష్యాన్ని రూపొందించుకోండి.
నెలవారీ SIP పెట్టుబడి₹0
పెట్టుబడి పెట్టిన మొత్తం యొక్క భవిష్య విలువ
₹0
మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మిగిలిన మొత్తం
₹0
నెలవారీ SIP పెట్టుబడి₹0
పెట్టుబడి పెట్టిన మొత్తం యొక్క భవిష్య విలువ
₹0
మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మిగిలిన మొత్తం
₹0
పరిత్యాగ ప్రకటన
- మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ప్రతి అసెట్ క్లాస్‌కు నిర్దిష్ట రిస్క్ స్థాయి ఉంటుంది.
- ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ అనేది కేవలం మీ SIP మరియు ఏకమొత్తం పెట్టుబడుల భవిష్య విలువను నిర్ణయించడానికి సుమారుగా కనుగొనే పద్దతి. ఈ క్యాలిక్యులేటర్ భవిష్య రాబడులు లేదా ఏదైనా పెట్టుబడి యొక్క పనితీరుకు హామీ ఇవ్వదు మరియు మార్కెట్ పరిస్థితులు, పన్ను చట్టాలు, ఇతర కారకాల పై ఆధారపడి అసలైన ఫలితాలు మారవచ్చు.
- రాబడులపై ప్రభావం చూపే, పెట్టుబడితో సంబంధం ఉన్న అన్నీ ఫీజులు, ఛార్జీలు మరియు ఖర్చులను క్యాలిక్యులేటర్‌లు పరిగణలోకి తీసుకోకపోవచ్చు.
- నిర్ణయం తీసుకునే ముందు, మీ సొంత విశ్లేషణను చేసుకోవడం లేదా ఆర్ధిక సలహాదారు సలహాలు పొందడం మంచిది.
- దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.
- మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.
- మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
ఇతర క్యాలిక్యులేటర్లు

మీ యొక్క నెలవారీ SIP పెట్టుబడుల యొక్క భవిష్య విలువను కనుక్కోండి.

ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు చేయవలసిన నెలవారీ SIP పెట్టుబడులను నిర్ధారిస్తుంది.

మీ నగదు మీద ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) యొక్క ప్రభావాన్ని లెక్కించండి. ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) దృష్ట్యా మీ ప్రస్తుత ఖర్చులను తీర్చుకునేందుకు భవిష్యత్తులో మీకు ఎంత నగదు అవసరమవుతుందో కనుక్కోండి.

మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీ రాబడిపై ఉండే ప్రభావాన్ని లెక్కించడాన్ని పరిగణించండి.
గురించి మరింత తెలుసుకోండి స్మార్ట్ గోల్
క్యాలిక్యులేటర్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు




స్మార్ట్ గోల్ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?
మీకు కావాల్సిన సమయంలో, లక్ష్యంగా చేసుకున్న సంపదను సమకూర్చుకోవడానికి, స్మార్ట్ గోల్డ్ క్యాలిక్యులేటర్ అనేది ఏకమొత్తంగా లేదా SIP ద్వారా, లేదా రెండిటి కలయికలో మీరు ఎంత డబ్బును పెట్టుబడి పెట్టాలి అని నిర్ణయించడంలో మీకు సహాయపడే ఒక ఉపయోగకరమైన సాధనం.
మీ టార్గెట్ విలువ, పెట్టుబడి వ్యవధి మరియు ఆశిస్తున్న రాబడులు వంటి కొన్ని అవసరమైన వివరాలను అందించడం ద్వారా, ఏకమొత్తం మరియు SIP పెట్టుబడుల మధ్య సరైన కేటాయింపును క్యాలిక్యులేటర్ లెక్కిస్తుంది.
స్మార్ట్ గోల్ క్యాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?
స్మార్ట్ గోల్ క్యాలిక్యులేటర్‌ను సమర్ధవంతంగా ఉపయోగించడానికి, మీరు మీ పెట్టుబడి ప్రణాళిక గురించి నిర్దిష్ట సమాచారాన్ని అందించాలి.
- టార్గెట్ విలువ: మీ పెట్టుబడుల ద్వారా మీరు పొందాలనుకుంటున్న టార్గెట్ విలువను ఎంటర్ చేయండి. పెట్టుబడి వ్యవధి: మీ ఆర్ధిక లక్ష్యాన్ని ఎంత వ్యవధిలో చేరుకోవాలనుకుంటున్నారో పేర్కొనండి.
- ఏకమొత్తం: మీరు ఒకేసారి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటుంటే (పెట్టుబడి పెట్టవలసిన SIP మొత్తాన్ని తెలుసుకోవాలంటే), మీరు మొదటిగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- SIP మొత్తం: సిస్టమాటిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా క్రమమైన పెట్టుబడులకు మీరు ప్రాధాన్యత ఇస్తే (పెట్టుబడి పెట్టవలసిన ఏకమొత్తం విలువను తెలుసుకోవాలంటే), క్రమానుగత పెట్టుబడి మొత్తాన్ని అందించండి.
- ఆశిస్తున్న రాబడి రేటు: మీ పెట్టుబడిపై మీరు ఆశిస్తున్న సగటు వార్షిక రాబడి రేటును ఎంచుకోండి.
మీరు ఈ వివరాలను ఎంటర్ చేసిన తరువాత, మీరు ఎంచుకున్న వ్యవధిలో, మీరు కోరుకునే ఆర్ధిక లక్ష్యానికి చేరుకోవడానికి ముందుగా ఏకమొత్తంగా మరియు SIP ద్వారా క్రమానుగతంగా ఎంత డబ్బును పెట్టుబడి పెట్టాలో క్యాలిక్యులేటర్ మీకు చూపుతుంది.
స్మార్ట్ గోల్ క్యాలిక్యులేటర్‌ను అర్ధం చేసుకోవడం
ఈ క్యాలిక్యులేటర్ పనితీరును వివరించడానికి, ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.
మీకు రూ.1 కోటి పదవీ విరమణ లక్ష్యం ఉంది అని పరిగణించండి. వచ్చే నెలలో మీరు రూ.5 లక్షల బోనస్ పొందనున్నారు, ఈ మొత్తంతో మీరు మీ పదవీ విరమణ కోసం పొదుపును ప్రారంభించాలని అనుకుంటున్నారు. అయితే, మీ పదవీ విరమణకు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉన్నందున, మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ ఏకమొత్తం మాత్రమే సరిపోదని మీకు తెలుసు. మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టాలని మీరు అర్ధం చేసుకున్నారు, కానీ మరొక ఏకమొత్తాన్ని పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు.శుభవార్త ఏమిటంటే మీరు సిస్టమాటిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఎంచుకోవచ్చు మరియు నెలవారీగా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు.
ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏంటంటే మీ పదవీ విరమణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి నెల మీరు ఎంత ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి?
మీ లక్ష్యం కోటి రూపాయిలను సమకూర్చడం. మీరు ఇప్పటికే 15 సంవత్సరాలకు గాను 12% రాబడిని ఆశిస్తు రూ.5 లక్షలను పెట్టుబడి పెట్టారు. అయితే, మీ ప్రస్తుత పెట్టుబడి ఆధారంగా తుది విలువ రూ.27,36,782.88 అని క్యాలిక్యులేటర్ లెక్కిస్తుంది, అంటే రూ.72,63,217.12 లోటును సూచిస్తోంది.
ఇప్పుడు, నెలవారీ SIP పెట్టుబడుల ద్వారా ఈ లోటును పూరించడానికి పరిష్కారాన్ని అన్వేషిద్దాం. 12% అంచనా రాబడితో పెట్టుబడి పథకంలో ఎటువంటి మార్పులు ఉండవు.
మీరు ఈ సంఖ్యలను క్యాలిక్యులేటర్‌లో ఎంటర్ చేసినప్పుడు, మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు రూ.14,539 నెలవారీగా SIPలో పెట్టుబడి పెట్టాలని క్యాలిక్యులేటర్ వెల్లడిస్తుంది.
అదే విధంగా, మీరు SIP ద్వారా పెట్టుబడి పెడుతున్నపుడు, మీ టార్గెట్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం అని గ్రహిస్తే, ఏకమొత్తంతో మీ పదవీ విరమణ పెట్టుబడులను పూరించడాన్ని మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ వివరాలను క్యాలిక్యులేటర్‌లో ఎంటర్ చేస్తే, మీకు కావలసిన వ్యవధిలో, పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉన్న అదనపు ఏకమొత్తం విలువ ఎంతో నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది.