టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి?

టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అనేవి ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షను 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందించే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. కాబట్టి, ఈక్విటీ-ఆధారిత టాక్స్ సేవిగ్స్ ఇన్‌స్ట్రుమెంట్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఏ పన్ను చెల్లింపుదారునికి అయినా ELSS ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ELSS ఫండ్స్ అనేవి నెలనెలా జీతం వచ్చేవారికి మరింత అనుకూలం ఎందుకంటే వారికి క్రమమైన ఆదాయ వనరు ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం టాక్స్ సేవింగ్ పెట్టుబడులు పెట్టడం అవసరం. నిజానికి, వారు రూపాయి-ధర సరాసరి నుండి ప్రయోజనం పొందడానికి ELSS లో SIP ద్వారా నెలవారీ ప్రాతిపదికన హాయిగా పెట్టుబడి పెట్టవచ్చు.

ఒకవేళ మీరు యువ పన్ను చెల్లింపుదారు అయితే, ELSS లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రెండు ప్రయోజలను పొందవచ్చు, అంటే. సెక్షను 80C కింద పన్ను మినహాయింపు మరియు ప్రతి సంవత్సరం ELSS లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘ-కాలంలో ఈక్విటీల పెరుగుదల సామర్థ్యం పొందడం. పెద్దవయసు పన్ను చెల్లింపుదారులు కూడా పన్ను ప్రయోజనాలను పొందడానికి ELSS లో పెట్టగలిగినప్పటికీ, ELSS లో అంతర్గతంగా ఉన్న ఈక్విటీ రిస్క్‌కు పెద్ద పెట్టుబడి పరిధి. అవసరమవుతుంది, అది వారికి ఉండకపోవచ్చు.  
గుర్తుంచుకోండి, ELSS ఫండ్స్‌కు 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. ఏకమొత్తం పెట్టుబడి పెట్టిన సందంర్భంలో, మీరు ఈరోజు పెట్టుబడి పెడితే మీ డబ్బును మీరు 3 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకోగలరు. ప్రతీ SIP చెల్లింపుకు కూడా లాక్-ఇన్ పీరియడ్ వర్తిస్తుంది. 12 నెలలలో పెట్టిన పెట్టుబడి పూర్తి సొమ్ము మీరు విత్‌డ్రా చేయాలనుకుంటే, చివరి SIP ఇన్‌స్టాల్‌మెంట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు మీరు వేచి ఉండాలి. కానీ ఇది లాక్-ఇన్ పీరియడ్ ఫండ్‌లో నిలకడగా ఉండటమే కాదు, ELSS అందించగలిగే నిజమైన పెరుగుదల సామర్థ్యాన్ని చూడటానికి మీ పెట్టుబడులను దాన్ని దాటి కొనసాగించాలి.

పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తితో పోలిస్తే అతని/ఆమె కంటే చాలా దశాబ్ధాల పని జీవితం ఉన్న ఒక యువ పన్ను చెల్లింపుదారుడు ELSS యొక్క ద్వంద్వ ప్రయోజనాలను బాగా పొందవచ్చు. పదవీ విరమణకు ఇంకా 5-7 సంవత్సరాలు ఉన్నప్పటికీ, ఒకవేళ అతడు/ఆమెకు కావలసిన రిస్క్ అపెటైట్ ఉంటే వారు ELSS ను ఒక ఎంపికగా పరిగణించవచ్చు. ఆవిధంగా, మీ వయస్సు, రిస్క్ ప్రాధాన్యతలు, గృహ మరియు విద్యా రుణం వంటి ఇతర రుణాలపై ఆధారపడి ELSS మీ ప్రాధాన్యతగల టాక్స్ సేవింగ్ ఎంపిక కాగలదు, అది మీకు పాత పన్ను విధానాన్ని మరింత అనుకూలం చేస్తుంది.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను