పెట్టుబడిదారులను ఏఏ రకాలైన వివిధ రిస్క్ ప్రొఫైల్స్‌గా విభజించవచ్చు?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

వాటివాటి రిస్కును బట్టి మ్యూచువల్ ఫండ్‌ పథకాలలో వివిధ వర్గాలు ఉన్న విధంగానే, పెట్టుబడిదారులను కూడా వారి వారి రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా అటువంటి వర్గాలలో గ్రూప్ చేస్తాము. రెండు కారకాల ఆధారంగా పెట్టుబడిదారులను అగ్రెసివ్, మోడరేట్ మరియు కన్జర్వేటివ్ రిస్క్ ప్రొఫైళ్ళుగా వర్గీకరించవచ్చు. ఒక పెట్టుబడిదారుని యొక్క రిస్క్ ప్రొఫైల్ అతని/ఆమె యొక్క రిస్క్ తీసుకోగల సామర్ధ్యం (రిస్క్ కెపాసిటీ) మీద, అలాగే రిస్కును ఊహించేందుకు చూపే సుముఖత (రిస్క్ అవెర్షన్) మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక పెట్టుబడిదారు రిస్కు తీసుకునేందుకు స్వల్ప సుముఖతను చూపుతూ, స్వల్ప సామర్ధ్యాలను కలిగి ఉంటే, అతనిని/ఆమెను మేము కన్జర్వేటివ్ కస్టమర్‌గా పిలుస్తాము, వారు ఋణ నిధులు, బ్యాంకు ఎఫ్‌డిలు వంటి స్వల్ప రిస్క్ పెట్టుబడి ఉత్పత్తులలో పెట్టుబడి చేయాలి.

ఒకవేళ ఒక పెట్టుబడిదారు రిస్కు తీసుకునేందుకు అధిక సుముఖతను చూపుతూ, అధిక సామర్ధ్యాలను కలిగి ఉంటే, అటువంటి పెట్టుబడిదారునికి మ్యూచువల్ ఫండ్లు, డైరెక్ట్ ఈక్విటీ వంటి అగ్రెసివ్ రిస్క్ వర్గాల ఉత్పత్తులలో పెట్టుబడి చేయమని ఉత్తమమైన సూచన ఇవ్వబడుతుంది. అయితే, ఒక పెట్టుబడిదారు రిస్కును తీసుకునేందుకు అధిక సుముఖతను చూపి, రిస్కును ఊహించడంలో స్వల్ప సామర్ధ్యాన్ని కలిగిఉన్నా లేదా స్వల్ప సుముఖత చూపి, అధిక సామర్ధ్యం కలిగి ఉన్నా, అటువంటి పెట్టుబడిదారుకు మోడరేట్ రిస్క్ పెట్టుబడి ఉత్పత్తులలో పెట్టుబడి చేయవలసిందిగా చక్కటి సూచన ఇస్తాము. తమ జీవితాన్ని ఇరకాటంలో పెట్టని మోడరేట్ రిస్కును తీసుకోవడానికి ఇష్టపడే పెట్టుబడిదారులను మోడరేట్ పెట్టుబడిదారులుగా సూచిస్తారు. సమతుల్య మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేసేందుకు వారు ప్రాధాన్యతను చూపుతారు.

పెట్టుబడిదారుని రిస్క్ సామర్ధ్యత, రిస్క్ అవెర్షన్‌ల పరిధులలో పెట్టుబడుల రిస్క్ ఉన్నట్లైతే, ఆ పెట్టుబడులను ఆ పెట్టుబడిదారునికి తగినవిగా పరిగణిస్తారు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను