రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?

రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్ మీరు రిటైర్ అయిన తర్వాత మీ జీవనశైలిని ప్లాన్ చేయడానికి మీకు సహాయపడుతుంది.

రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్, బాండ్‌లు రెండింటిపై పెట్టుబడులను పెడతాయి, పదవీ విరమణ సమీపిస్తున్న కొద్దీ క్రమంగా తక్కువ రిస్క్ ఆప్షన్‌ల వైపు మల్లిస్తారు. ఇవి రిటైర్ అయిన వారికి క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తాయి మరియు తక్కువ ఖర్చు నిష్పత్తులతో ఉంటాయి నిష్క్రమణ ఋసుములను కలిగి ఉండవు. అయితే, అవి ఐదేళ్ల వరకు లేదా పదవీ విరమణ వరకు లాక్-ఇన్ పీరియడ్ؚతో వస్తాయి.

రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లక్షణాలు

రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ మీ పదవీ విరమణ ప్రాణాళికలకు సరిపోయేలా దీర్ఘ వ్యవధితో రూపొందించబడతాయి. సాధారణంగా ఈ ఫండ్‌లలో మీ డబ్బును 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ డబ్బును తక్కువ సమయంలో తిరిగి తీసుకోకుండా నిరోధిస్తుంది మరియు మీ పదవీ విరమణ కోసం సిద్ధంగా ఉంచడానికి సహాయపడుతుంది.

రిటైర్మెంట్ ఫండ్స్ మీ డబ్బును స్టాక్స్, బాండ్‌లు, కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ వంటి వివిధ అసెట్‌లలో పెట్టుబడి పెట్టేలా విస్తరిస్తాయి. ఈ కలయిక దీర్ఘకాలంలో నష్టాలను మరియు సంభావ్య లాభాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

ఈ ఫండ్‌లు మీ డబ్బును వృద్ధి చేసే అంశాలు మరియు దానిని స్థిరంగా ఉంచే అంశాలకు మధ్య సరైన కలయికను కనుగొనడానికి ప్రయత్నిస్తాయి. మీ రిటైర్మెంట్ؚకు అవసరమైన వాటి ఆధారంగా కొంత డబ్బును స్టాక్ؚలలో, మరికొంత మొత్తాన్ని బాండ్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి.

స్టాక్స్ؚలో కొంత డబ్బు ఉన్నప్పటికీ, జాగ్రత్త వహించి, వీటిలో ఎక్కువగా పెట్టుబడి పెట్టవు. స్టాక్స్ؚలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసే సాధారణ ఫండ్స్ؚకు ఇది భిన్నంగా ఉంటుంది. మీ డబ్బును సురక్షితంగా ఉంచడం కోసం ఇలా చేస్తాయి.

కొన్ని రిటైర్మెంట్ ఫండ్స్, మీకు పన్నుల విషయంలో కూడా సహాయపడతాయి. మీరు ఈ ఫండ్‌లలో డబ్బు పెట్టినప్పుడు, మీరు తక్కువ పన్ను చెల్లించవచ్చు. ఇది దీర్ఘకాలంలో మీ డబ్బును ఆదా చేస్తాయి.

రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపికేనా?

మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్, ఇన్వెస్ట్మెంట్ పరిధిని బట్టి పదవీ విరమణ ప్లానింగ్ؚకు రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక.

స్టార్టర్స్ కోసం, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్‌లు సహజంగా వివిధ ఈక్విటీ మరియు డెట్ సాధనాలుగా వైవిధ్యం చేయబడాయి, ఇవి నష్టాలను తగ్గించడానికి మరియు సంభావ్య రాబడిని అందించడానికి సహాయపడతాయి.

మీరు పదవీ విరమణ వయస్సుకు చేరుకున్న తర్వాత, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్‌లు సేకరించిన కార్పస్ ఆధారంగా నెలవారీ లేదా త్రైమాసికం వంటి క్రమమైన విరామాలలో క్రమం తప్పకుండా చెల్లింపులను పొందే అవకాశాన్ని అందిస్తాయి. రెగ్యులర్ చెల్లింపు మీకు పదవీ విరమణ సమయంలో స్థిరమైన ఆదాయన్ని అందిస్తాయి.

అంతేకాకుండా, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్‌లను ప్రొఫెషనల్స్ నిర్వహిస్తారు, కాబట్టి ఇది కూడా ఒక ప్రయోజనకరం. అధిక లాక్-ఇన్ పీరియడ్ కలిగిన కొన్ని రిటైర్మెంట్ ఫండ్‌లు అదనపు ప్రయోజనంగా పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

284
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను