నేను తగినంత పొదుపు చేస్తే పదవీ విరమణ కోసం నేను ప్లాను చేయవలసిన అవసరం ఏమిటి?

నేను తగినంత పొదుపు చేస్తే పదవీ విరమణ కోసం నేను ప్లాను చేయవలసిన అవసరం ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీ వయస్సు మరియు ఆర్థిక స్థితి ఏదైనప్పటికీ, రేపు ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడూ తెలుసుకోలేరు. రేపు ఏమి జరుగుతుందో మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు, మీరు పదవీ విరమణ కోసం పొదుపు చేసిన డబ్బు చివరి రోజు వరకు మిమ్మల్ని కాపాడుతుందని ఎలా అనుకోగలరు? 

జీవిత కాలం మరియు వైద్య ఖర్చులు రెండూ పెరుగుతూ ఉన్నాయి, మీ పదవీ విరమణ దశ ఒక దశాబ్దం ఉంటుందో మూడు దశాబ్దాలు ఉంటుందో మీకు తెలియదు. ఏదైనా ఆర్థిక ప్లానింగు ప్రభావవంతంగా పని చేయడం కోసం, కాల పరిధి తెలుసుకోవడం కీలకం, కానీ ఈ సందర్భంలో, కాల పరిధి విషయంలో ఖచ్చితత్వం లేదు. కాబట్టి, మీ పదవీ విరమణ నిధిలో మిగులు ఉండేలా ఏర్పాటు చేసుకోవడం అత్యుత్తమం. అయితే ఆర్థిక లక్ష్యాలను పూర్తి చేస్తూ మిగులు నిర్మించడం ఎలా అనేది ఒక సవాళు?  మీరు మీ సేవిగ్స్‌ను దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా మరియు సంపద పెంచేలా చేసే సామర్థ్యం కలిగిన మ్యూచువల్ ఫండ్లు లాంటి  దేనిలోనైనా పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పదవీ విరమణ జీవితం కోసం తగినంత మదుపు పెట్టగలరు.  

ఒక మిగులు పదవీ విరమణ ఫండు మిమ్మల్ని వైద్య అత్యవసర పరిస్థితి లేక ఏదైనా జరగకూడని సంఘటనలు లాంటి అనుకోని కుదుపుల నుండి కాపాడుతుంది. అంతేకాకుండా, మీ పిల్లలు లేదా మనుమలు, మనుమరాళ్ల మీద మీ ప్రేమ వ్యక్తం చేయడానికి అప్పుడప్పుడూ బహుమతులు ఇవ్వడం, కుటుంబం మరియు స్నేహితులను కలుసుకోవడానికి తరచూ ప్రయాణం చేయడం మరియు మిమ్మల్ని ఆనందంగా ఉంచుకోవడానికి ఏవైనా చేయడం లాంటి వాటికి కూడా మీరు డబ్బు ఖర్చు పెట్టగలరు.  పదవీ విరమణ జీవితాన్ని మీరు ఆనందంగా గడపాలనుకుంటే దాని కోసం సేవ్ చేయడం ఇంత చాలు అనేది లేదు!

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను