భారతదేశంలో మ్యూచువల్ ఫండ్‌లను ఎవరు నియంత్రిస్తారు?

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్‌లను ఎవరు నియంత్రిస్తారు? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్‌లు అనేవి ఆధునిక కాలపు పెట్టుబడి ఎంపిక. అందువల్ల, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను ఎవరు నియంత్రిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లేదా SEBI భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ యొక్క అన్ని అంశాలను నియంత్రిస్తుంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో పారదర్శకత, నిష్పాక్షికత, పెట్టుబడిదారుల భద్రత కోసం కఠినమైన నియమనిబంధనలను రూపొందించింది.

SEBI 1988లో స్థాపించబడిన SEBI, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 నుండి చట్టం ద్వారా దాని అధికారాన్ని పొందింది. 

మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేయబడింది, దీనిలో స్పాన్సర్, ట్రస్టీలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) మరియు కస్టోడియన్ ఉంటారు. ఒక స్పాన్సర్ లేదా ఒక కంపెనీకి ప్రమోటర్ వంటి ఒకరి కంటే ఎక్కువ మంది స్పాన్సర్ؚల ద్వారా ట్రస్ట్ స్థాపించబడుతుంది. మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు యూనిట్ హోల్డర్ల ప్రయోజనం కోసం తన ఆస్తులను నిర్వహిస్తారు. SEBI ఆమోదించిన AMC వివిధ రకాల సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిధులను నిర్వహిస్తుంది. SEBIలో నమోదు చేసుకోవాల్సిన కస్టోడియన్ ఫండ్ؚకు చెందిన వివిధ పథకాల సెక్యూరిటీలను తన ఆధీనంలో ఉంచుకుంటారు. ట్రస్టీలకు AMCపై పర్యవేక్షణ, దిశానిర్దేశం చేసే సాధారణ అధికారాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ ద్వారా SEBI నిబంధనలు పనితీరు, సమ్మతిని వీరు పర్యవేక్షిస్తారు. SEBI నిబంధనల ప్రకారం ట్రస్టీ కంపెనీ లేదా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల డైరెక్టర్లలో కనీసం మూడింట రెండొంతుల మంది స్వతంత్రంగా ఉండాలి అంటే వారు స్పాన్సర్లతో అసోసియేట్ కాకూడదు. అలాగే, AMC డైరెక్టర్లలో 50 శాతం మంది స్వతంత్రంగా ఉండాలి.

SEBI సాధారణంగా ఈ క్రింది వాటికి బాధ్యత వహిస్తుంది:

నమోదు మరియు ఆమోదం: మ్యూచువల్ ఫండ్ SEBIలో రిజిస్టర్ అయ్యి ఉండాలి, అది తన ప్రతి పథకం కింద ప్రజల నుండి నిధులను సమీకరించవచ్చు.

పెట్టుబడిదారుల భద్రత: నిష్పాక్షికమైన మరియు నైతిక పద్ధతులను నిర్ధారించడానికి, మోసపూరిత కార్యకలాపాలను మరియు పెట్టుబడిదారులకు హాని కలిగించే ప్రయోజనాల వైరుధ్యాలను నివారించడానికి SEBI మార్గదర్శకాలను ఏర్పరుస్తుంది.

బహిర్గత ఆవశ్యకతలు: మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటికప్పుడు SEBI నిర్దేశించిన నిర్దిష్ట బహిర్గత నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

ప్రవర్తనా నియమావళి: నైతిక ప్రవర్తన మరియు వృత్తిపరమైన ప్రమాణాలను నిర్ధారించడానికి మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ మేనేజర్లు మరియు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ప్రమేయం ఉన్న ఇతర కీలక సిబ్బందికి SEBI ఒక ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేస్తుంది.

కాలానుగుణ సమీక్షలు మరియు నవీకరణలు: మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రెగ్యులేటరీ ఫ్రేమ్ؚవర్క్ దృఢంగా మరియు బాధ్యత కలిగి ఉండేలా SEBI చూసుకుంటుంది.

నిరంతర పర్యవేక్షణ మరియు నిఘా: రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి SEBI మ్యూచువల్ ఫండ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంది మరియు నిఘా ఉంచుతుంది. ఉల్లంఘనలు జరిగితే దిద్దుబాటు చర్యలు తీసుకోవడం, జరిమానాలు విధించడం లేదా ఆదేశాలు జారీ చేసే అధికారం దీనికి ఉంది.

పైన పేర్కొన్న అన్ని విధులు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడతాయి తగినవిగా భావించే చర్యల ద్వారా సెక్యూరిటీలలో పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం మరియు సెక్యూరిటీల మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, మరియు క్రమబద్ధీకరించడం. 

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను