ETFలో మీరు ఎందుకు పెట్టుబడి చేయాలి?

ETFలో మీరు ఎందుకు పెట్టుబడి చేయాలి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

స్టాక్‌ల్లో పెట్టుబడి పెట్టాలని మీరు చూస్తున్నారు కానీ మీ పోర్ట్‌ఫోలియోకు తగిన స్టాక్‌లను ఎంచుకునేందుకు సమయం గానీ, పరిశోధన చేసే సామర్ధ్యం గానీ లేనట్లైతే, ETFలు మిమ్మల్ని ఆదుకుంటాయి! లిక్విడిటీ విషయంలో రాజీ పడకుండా ఒక్కొక్క స్టాక్‌లో పెట్టుబడి చేయడం కన్నా అత్యంత సులువుగా స్టాక్ మార్కెట్‌లో మీరు పాల్గొనడానికి ETFలు సహాయపడతాయి. డైరెక్ట్ స్టాక్‌లో పెట్టుబడి చేయడంతో పోలిస్తే తక్కువ ఖర్చు వద్ద అత్యంత వైవిధ్యతను అవి అందిస్తాయి.

ఒక ETF లేదా ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ అనేది అనేది స్టాక్ ఎక్స్ఛేంజీ మీద జాబితా చేయబడిన ఒక రకపు మ్యూచువల్ ఫండ్ మరియు ఎక్స్ఛేంజీ మీద జాబితా చేయబడిన ఏదైనా ఇతర స్టాక్‌ లాగానే దీనిని కూడా వాస్తవ-సమయంలో ట్రేడ్ చేయవచ్చు. ETF లు ఒక రకపు మ్యూచువల్ ఫండ్‌లు కాబట్టి, వాటి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్ సూచీల మిశ్రమాన్ని ప్రతిబింబించే సెక్యూరిటీల సముదాయం ఉంటుంది. కాబట్టి, కొన్ని స్టాక్‌లను ఎంచుకునేందుకు పరిశోధనలు చేయడానికి మీ సమయాన్ని, శక్తిని ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా మార్కెట్ సూచీలో భాగమైన ఎంచుకోదగిన స్టాక్‌లలో మీరు పెట్టుబడి చేయగలుగుతారు. స్టాక్ పెట్టుబడి ఖర్చుతో పోల్చినప్పుడు మాత్రమే కాకుండా వాటి తక్కువ వ్యయ నిష్పత్తి కారణంగా మ్యూచువల్ ఫండ్‌లు ఇతర కేటగిరీలతో పోల్చినప్పుడు కూడా ETFలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.

 ETFలు బాండ్‌ మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి, ఏవేని డెబ్ట్ మ్యూచువల్‌ ఫండ్‌ మాదిరిగానే డెబ్ట్ అసెట్ వర్గం మీద అవగాహన పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి. మీ పెట్టుబడి అవసరాల ఆధారంగా కంపెనీ బాండ్స్ లేదా స్టాక్‌ల విస్తార సముదాయంలో తక్కువ ఖర్చుతో మీరు పెట్టుబడి చేయవచ్చు మరియు స్టాక్లు లేదా బాండ్ల మాదిరిగానే వాటిలో ట్రేడ్ చేయవచ్చు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను