కెవైసి ప్రక్రియ అంటే ఏమిటి?

కెవైసి ప్రక్రియ అంటే ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

కెవైసి అనేది “నో యువర్ కస్టమర్ (మీ కస్టమర్‌ని తెలుసుకోండి)” కి సంక్షిప్త పేరు మరియు ఏదైనా ఆర్థిక సంస్థలో అకౌంట్ ఓపెన్ చేయడంలో భాగంగా కస్టమర్ గుర్తింపు ప్రక్రియ కొరకు ఉపయోగించే పదము. నిర్దేశించబడిన ఫోటో గుర్తింపు (ఉదా, ప్యాన్ కార్డ్, ఆధార్ కార్డ్) మరియు చిరునామా రుజువు లాంటి సంబంధిత మద్దతు దస్తావేజులు మరియు వ్యక్తిగత ధృవీకరణ (ఐపివి) ద్వారా ఇన్వెస్టర్‌ గుర్తింపు & చిరునామాను కెవైసి స్థాపిస్తుంది. మనీ లాండరింగ్ యాక్ట్, 2002 మరియు ఆ తరువాత ఏర్పాటు చేసిన నియమాలు, యాంటీ మనీ లాండరింగ్ (ఎఎమ్ఎల్) ప్రమాణాలు/ కంబాటింగ్ ది ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం (సిఎఫ్‌టి)/సెక్యూరిటీస్ మార్కెట్ ఇంటర్మీడియరీస్ పైన సెబీ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం కెవైసి అమలు తప్పనిసరి.

ఒక నో యువర్ కస్టమర్ (కెవైసి) సాధారణంగా 2 భాగాలుగా విభజింపబడుతుంది:

పార్ట్ I సెంట్రల్ కెవైసి రిజిస్ట్రీ (ఏకరూప కెవైసి) ద్వారా నిర్దేశించబడిన ప్రాథమిక మరియు ఏకరూప కెవైసి వివరాలను అందరు రిజిష్టర్డ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఉపయోగించవలసినది కలిగి ఉంటుంది మరియు

పార్ట్ II మ్యూచువల్‌ ఫండ్, స్టాక్ బ్రోకర్, ఇన్వెస్టర్‌ (అదనపు కెవైసి) ఖాతాను తెరిచే డిపాజిటరీ పార్టిసిపెంట్ లాంటి ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ ద్వారా అదనపు సమాచారం ప్రత్యేకంగా కోరేది.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను