Skip to main content

తెలివైన పెట్టుబడి నిర్ణయాలను తీసుకోండి

మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై రాబడిని అంచనా వేయడానికి మా కాలిక్యులేటర్‌లను ఉపయోగించండి.

SIP Calculator
ఎస్‌ఐపి (SIP) క్యాలిక్యులేటర్

మీ యొక్క నెలవారీ SIP పెట్టుబడుల యొక్క భవిష్య విలువను కనుక్కోండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
goal sip calculator
లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్

ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు చేయవలసిన నెలవారీ SIP పెట్టుబడులను నిర్ధారిస్తుంది.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
smart goal calculator
స్మార్ట్ గోల్ క్యాలిక్యులేటర్

మీ ప్రస్తుత పెట్టుబడిని పరిగణించి, అవసరమైన SIP లేదా ఏకమొత్తాన్ని లెక్కించడం ద్వారా మీ ఆర్ధిక లక్ష్యాన్ని రూపొందించుకోండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
inflation calculator
ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) క్యాలిక్యులేటర్

మీ నగదు మీద ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) యొక్క ప్రభావాన్ని లెక్కించండి. ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) దృష్ట్యా మీ ప్రస్తుత ఖర్చులను తీర్చుకునేందుకు భవిష్యత్తులో మీకు ఎంత నగదు అవసరమవుతుందో కనుక్కోండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
Cost of delay calculator
విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) క్యాలిక్యులేటర్

మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీ రాబడిపై ఉండే ప్రభావాన్ని లెక్కించడాన్ని పరిగణించండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
Lumpsum Investment Calculator
లంప్‌సమ్ (ఏకమొత్తం) పెట్టుబడి క్యాలిక్యులేటర్

మీ లంప్‌సమ్ (ఏకమొత్తం) పెట్టుబడి పై సంభావ్య రాబడులను లెక్కించండి

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
Retirement Planning Calculator
రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్

మీ ఖర్చుల ఆధారంగా మీకు అవసరమైన రిటైర్మెంట్ నిధిని అంచనా వేయండి, దాన్ని సాధించడానికి అవసరమైన నెలవారీ పెట్టుబడిని కూడా గణించండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
Step-Up SIP Calculator
స్టెప్-అప్ SIP క్యాలిక్యులేటర్

మీరు మీ SIP ని క్రమం తప్పకుండా కొంత శాతం పెంచినప్పుడు, మీ SIP పెట్టుబడుల భవిష్యత్తు విలువను లెక్కించండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
Systematic Withdrawal Plan (SWP) Calculator
సిస్టమెటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) క్యాలిక్యులేటర్

పెట్టుబడిపై వడ్డీ వచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకొని, నిర్ధిష్టమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడానంతరం పెట్టుబడి యొక్క తుదిమూల్యాన్ని గణించండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి

కాలిక్యులేటర్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

finance-planning
సులభంగా ఆర్థిక ప్రణాళిక చేయవచ్చు
saves-time
సమయన్నీ ఆదా చేస్తుంది
easy-to-use
ఉపయోగించడం సులభం
helps-make-informed-decisions
అవగాహనతో కూడిన నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతుంది

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్‌లు, ఏదైనా ఫండ్‌లో మీ పెట్టుబడి యొక్క రాబడి మరియు భవిష్యత్తు విలువలను లెక్కించడంలో మీకు సహాయపడే ఆన్‌లైన్ సాధనాలు. ఇవి పెట్టుబడి ప్రారంభ మొత్తం, ఆశించిన రాబడి రేటు, పెట్టుబడి కాలపరిమితి మరియు జోడింపుల తరుచుదనం వంటి అనేక అంశాలను పరిగణనoలోకి తీసుకొని లెక్కిస్తాయి. అయితే, మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ అనేది కాలక్రమేణా పెట్టుబడి పెరుగుదలకు సంబంధించి ఒక ఉదాహరణ మాత్రమే, పెట్టుబడుల ఖచ్చితమైన రాబడిని అందించవు.

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ మీకు ఎలా సహాయపడుతుంది?

మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి మీకు అందిస్తున్న ఆధునిక ఆన్‌లైన్ మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్‌లు మీకు వివిధ మార్గాలలో సహాయపడతాయి. ముఖ్యంగా ఇవి ఈ క్రింది వాటిలో సహాయపడతాయి:

  1. ఇవి పెట్టుబడి వేరియబుల్స్‌ను నిర్ణయించడంలో పెట్టుబడిదారుడికి సహాయపడతాయి: కాలిక్యులేటర్ అందించే అంచనా ఆధారంగా పెట్టుబడిదారుడు పెట్టుబడి కాలవ్యవధి, ఆశించిన రాబడి మరియు ప్రారంభ పెట్టుబడి మొత్తం వంటి పెట్టుబడి వేరియబుల్స్‌ను నిర్ణయించవచ్చు.
  2. ఇది భవిష్యతు వ్యూహాలను ప్రణాళిక చేయడానికి సహాయపడుతుంది: కాలిక్యులేటర్ అందించే అంచనా రాబడికి అనుగుణంగా మీరు మీ భవిష్యత్తు ఆర్థిక వ్యూహాలను ప్లాన్ చేసుకోవచ్చు.

మ్యమ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్‌లు, మీరు కాలిక్యులేటర్‌లో నమోదు చేసే వేరియబుల్స్ ప్రకారం పెట్టుబడి రాబడులను అంచనా వేయడానికి ఒక సాధారణ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తాయి.

ఇది ఉపయోగించడానికి సులభమైన సాధనం మరియు పెట్టుబడిదారుడు మాన్యువల్‌గా లెక్కించే అవసరం లేకుండా చేస్తుంది

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిదారు పెట్టుబడిని రెండు విధాలుగా చేయవచ్చు: SIPలు మరియు లంప్‌సమ్. ఈ కాలిక్యులేటర్ పెట్టుబడిదారుడిని ఈ రెండు రకాల పెట్టుబడుల అంచనా భవిష్యత్తు విలువను తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తుంది.

అయితే, ఈ కాలిక్యులేటర్ మీకు అంచనాలను అందించడానికి, మీరు క్రింది మూడు డేటా పాయింట్లను నమోదు చేయాలి, అవి;

  • పెట్టుబడి మొత్తం
  • పెట్టుబడి వ్యవధి
  • అంచనా వేసిన రాబడి రేటు

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ఉపయోగించే ఫార్ములా:

ఎ) లంప్‌సమ్ లేదా వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం -

భవిష్యత్తు విలువ = ప్రస్తుత విలువ (1 + r/100)^n

r = రాబడి అంచనా రేటు

n = పెట్టుబడి వ్యవధి

బి) SIPల కోసం -

FV = P [(1+i)^n-1]*(1+i)/i

FV = భవిష్యత్తు విలువ

P = మీరు SIP ద్వారా పెట్టుబడి పెట్టే ప్రధాన మొత్తం

i = కాంపౌండ్డ్ రేట్ ఆఫ్ రిటర్న్

n = నెలలలో పెట్టుబడి వ్యవధి

r = ఆశించిన రాబడి రేటు

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించే దశలు క్రింది విధంగా ఉన్నాయి:

దశ 1: మీ పెట్టుబడి మొత్తం మరియు పెట్టుబడి స్వభావాన్ని నమోదు చేయండి (SIP లేదా లంప్‌సమ్.)

దశ 2: మీ పెట్టుబడి కాలవ్యవధిని ఎంచుకోండి.

దశ 3: అంచనా రాబడి రేటును అందించండి.

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

మ్యూచువల్ ఫండ్ రాబడి కాలిక్యులేటర్ ఒక ముఖ్యమైన సాధనం, పెట్టుబడిదారులకు ఈ క్రింది ప్రయోజనాలను కలిగిస్తుంది:

  1. కాంపౌండింగ్ శక్తి యొక్క అనుభూతి పొందండి: ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ రాబడిని పెంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ అసలు పెట్టుబడి మరియు కాలక్రమేణా పొందే వడ్డీపై మీరు ఎంత సంపాదించవచ్చో అంచనా వేయండి
  2. SIP లేదా లంప్‌సమ్‌లో పెట్టుబడులను సరిపోల్చండి: మీరు SIPల ద్వారా మరియు లంప్‌సమ్‌ల ద్వారా రాబడిని లెక్కించవచ్చు. SIP లేదా లంప్‌సమ్‌లో పెట్టుబడి పెట్టాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.
  3. మాన్యువల్ లెక్కింపుల దోషాలను నివారించండి: మాన్యువల్ లెక్కింపు పద్ధతులు లేదా మానవ తప్పిదాల వలన సంభవించే సాధారణ దోషాలను కాలిక్యులేటర్ ఉపయోగించడం ద్వారా నివారించవచ్చు.
  4. పెట్టుబడి కోసం ఫ్యూచరిస్టిక్ స్ట్రాటజీ ప్లాన్‌లకు సహాయపడండి: అంచనాల ఆధారంగా భవిష్యత్తు కోసం వ్యూహాలను ప్లాన్ చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది.

FAQలు

మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్లు ఆన్‌లైన్ సాధనాలు, ఇవి పెట్టుబడి మొత్తం, కాలపరిమితి మరియు వడ్డీ రేటు వంటి కొన్ని కనీస డేటా పాయింట్‌లతో మీ కోసం అంచనా రాబడిని లెక్కించగలవు.

డిస్క్లైమర్

దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు. మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.