మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ను డైవర్సిఫై చేస్తే, ఎందుకు వాటిలో రిస్క్ ఉందని భావించబడుతున్నది?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి, అది ఈక్విటీ అయినా లేదా డెట్ అయినా, వీటి విలువలు మార్కెట్ కదలిక ప్రకారం ఒడిదుడుకులకు లోనవుతాయి. ఒక ఫండ్ NAV ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న ఒక్కో సెక్యూరిటీ విలువల మీద ఆధారపడుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాల సెక్యూరిటీల వ్యాప్తంగా పెట్టుబడి పెడతాయి కాబట్టి, అవి ఈ మార్కెట్ రిస్క్ను డైవర్సిఫై చేస్తాయి. ఒక ఫండ్అనేక సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతుంది కాబట్టి, ఒకే రోజు వాటన్నింటి విలువ పడిపోయే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఆవిధంగా, మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ను డైవర్సిఫై చేస్తాయనేది నిజమైనప్పటికీ, అవి దాన్ని తప్పించుకోలేవు. ఫండ్ మేనేజరు అనుసరించిన డైవర్సిఫికేషన్, ఆ డైవర్సిఫికేషన్ మేరకు ఫండ్ యొక్క మార్కెట్ రిస్క్ను తగ్గిస్తుంది. ఫండ్ ఎంత డైవర్సిపై అయి ఉంటుందో, రిస్క్ అంత తక్కువ ఉంటుంది. 

థిమ్యాటిక్ లేదా సెక్టర్ ఫండ్స్ లాంటి కేంద్రీకృత ఫండ్స్ మల్టీ-క్యాప్ ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్తో ఉంటాయి, ఎందుకంటే ఏదైనా ప్రతికూల మార్కెట్ పరిస్థితి ప్రభావితమైన ఆ సెక్టర్లో ఉన్న మొత్తం కంపెనీలను ఏదో విధంగా ప్రభావితం చేస్తుంది, అదే మల్టీ-క్యాప్ ఫండ్లో సెక్టారు మరియు క్యాపిటలైజేషన్ వ్యాప్తంగా ఉన్న డైవర్సిఫికేషన్ కారు ప్రమాదంలో ఎయిర్ బ్యాగ్ లాగా పని చేసి, ఆ ఫండ్ NAV మీద ప్రతికూల పరిస్థితి ప్రభావాన్ని తగ్గిస్తుంది. 

మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టినప్పుడు, ఫండ్ సెక్టారు కేటాయింపులో డైవర్సిఫికేషన్ యొక్క డిగ్రీ చూడండి. రిస్క్ తీసుకోగల మీ సామర్థ్యం మీద ఆధారపడి, మీకు అనుకూలంగా ఉండే సరైన రకం డైవర్సిఫికేషన్ ఉన్న ఫండ్ను ఎంచుకోండి.

402
481
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను