మీరు క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టాలా లేక మ్యూచువల్ ఫండ్స్లోనా?

మీరు క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టాలా లేక మ్యూచువల్ ఫండ్స్లోనా? zoom-icon
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

టెక్నాలజీ పురోగతి చెందటంతో, ఆర్థిక సేవలు, పెట్టుబడి ప్రోడక్ట్‌లు అందుబాటులోకి వచ్చే విధానంలో ఈరోజుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలను మరియు పెట్టుబడులను ఆన్‌లైన్‌లో చేయగలరు. ఇది స్వాగతించదగిన మార్పు అయినప్పటికీ, ఇది ఎన్నో అవకాశాలతో పాటు సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. వీటిలో క్రిప్టోకరెన్సీలు ఒకటి. అసలు క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం.

క్రిప్టోకరెన్సీలు క్రిప్టోల యజమానుల మధ్య మార్పిడి మాధ్యమంగా ఉపయోగించగల వర్చువల్ ఆస్తులు. క్రిప్టోలకు సంబంధించిన అన్ని లావాదేవీలు బ్లాక్‌చైన్ ఉపయోగించి ఒక నెట్‌వర్క్‌లో కనెక్ట్ చేసిన డేటాబేస్‌లలో లెడ్జర్  ఫార్మెట్‌లో  నిల్వ చేయబడతాయి. ఆవిధంగా, క్రిప్టోకరెన్సీలు భౌతిక రూపంలో మనుగడలో ఉండవు మరియు సెంట్రల్ బ్యాంకు ద్వారా జారీ చేయబడవు. కాబట్టి ఎవరైనా భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను డబ్బుగా ఉపయోగించలేరు. వాటిని డబ్బుగా, ఆస్థిగా, స్టాక్‌గా లేదా వస్తువుగా  పరిగణించాలా అనే విషయంలో వాటి స్థితి ఇప్పటికీ అస్పష్టంగా ఉంది, ఎందుకంటే భారతదేశంలో ఆర్‌బిఐ లేదా ఏదైనా ఇతర నియంత్రణా సంస్థ దాన్ని దాన్ని గుర్తించలేదు.  

క్రిప్టో కరెన్సీలలో పారదర్శకత, పోర్టబిలిటీ, వైవిధ్యత మరియు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి గొప్ప పెట్టుబడి అవకాశం లాంటి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, క్రిప్టోకరెన్సీల్లో ఉన్న వివిధ రిస్క్‌లను ఎవరూ విస్మరించలేరు. భారతదేశంలో ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలను నిషేధించనప్పటికీ, వాటి న్యాయపరమైన స్థితికి స్పష్టత ఇచ్చే చట్టం ఏదీ లేదు. కాబట్టి ఇది అస్పష్ట అసెట్ కేటగిరీ. ఇది ఎవరైనా ఊహించగలిగినంత అత్యంత అస్థిరమైన అసెట్. క్రిప్టోలలో బ్యాంకు ద్వారా వెళ్లకుండా రెండు పార్టీల మధ్య ఫండ్స్ బదిలీ చేయడం వీలవుతుంది, ఇది హవాలాకు మరియు మోసానికి గురవ్వడానికి దారి తీస్తుంది. ప్రభుత్వ నిబంధనలు లేకపోవడంతో, చిన్న మరియు సరిగా తెలియని పెట్టుబడిదారులు సులభంగా తమ డబ్బు పోగొట్టుకోగలరు.

మీరు కష్టపడి సంపాదించిన పొదుపును ఏ ప్రభుత్వ ఏజెన్సీ నియంత్రణ లేని ట్రెండ్ అయిన క్రిప్టోలలో కాకుండా బాగా నియంత్రించబడిన మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లు, బీమా లాంటి పెట్టుబడి ప్రొడక్ట్‌ల్లో పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ మంచిది. న్యాయపరమైన గుర్తింపు లేకపోవడం మరియు అధిక అస్థిరతతోపాటు, మీ లాభాలకు ఎలా పన్ను విధించాలో చెప్పే స్పష్టమైన పన్ను నియమాలు కూడా వాటికి లేవు.  మీకు మ్యూచువల్ ఫండ్స్ సంక్లిష్టంగా అనిపిస్తే, క్రిప్టోలు మీకు ఊహించలేనంత గందరగోళానికి గురిచేస్తాయి, ఎందుకంటే  పెట్టుబడి ప్రయోజనాల కోసం మీరు వాటికి ఎలా విలువ కట్టాలి లేదా మీ ఆర్థిక లక్ష్యాల ప్లానింగ్ కోసం మీరు వాటిపై ఆధారపడవచ్చా అనే విషయంలో మీకు సహాయపడటానికి ఈ అసెట్‌  వర్గాన్ని కూలంకషంగా కవర్ చేసే విశ్లేషకులు కూడా తగినంతమంది లేరు.

మ్యూచువల్ ఫండ్స్ ఎంతో కాలం నుండి ఉన్నాయి, రెగ్యులేటర్‌గా సెబీ (SEBI) పర్యవేక్షణలో పెట్టుబడిదారుడికి రక్షణ కల్పిస్తాయి, మీ ఆర్థిక లక్ష్యం మీద ఆధారపడి ఎంచుకోవడానికి అనేక ఎంపికలు ఇస్తాయి, వీటిని సులభంగా ట్రాక్ చేయవచ్చు మరియు తెలిసిన తర్వాతి నిర్ణయం తీసుకోవడానికి పెట్టుబడిదారులకు సహాయం చేయడానికి నెలవారీగా వెల్లడిస్తాయి. అవి సమస్యల పరిష్కారానికి యంత్రాంగాన్ని అందిస్తాయి. ఈ అంశాలన్నీ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచడానికి సహాయపడతాయి. క్రిప్టోకరెన్సీలలో ఇలాంటి ఏర్పాట్లు ఏవీ ఉండవు, అందుచేత మీ జీవితకాల పొదుపును పెట్టుబడి పెట్టడానికి అవి రిస్క్‌తో కూడుకున్నవి.

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎందులోనైనా పెట్టే ముందు మంచిచెడులను చూడటం వివేకవంతమైన పని, అవి క్రిప్టోలు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్  కావచ్చు లేదా మరేదైనా అసెట్ కావచ్చు. ఒక  అసెట్ వర్గం లేదా పెట్టుబడి ప్రొడక్ట మీ రిస్క్ ప్రొఫైల్ మరియు రాబడి అంచనా ప్రకారం మీకు అనుకూలమైనదా అని నిర్ణయించుకోవడానికి మీ సొంత పరిశోధన చేయండి. మీరు సొంతంగా ఈ నిర్ణయం తీసుకోలేకపోతే, సహాయం కోసం ఒక సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న ఆర్థిక సలహాదారును/మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ను సంప్రదించండి, అంతేకానీ హడావుడిగా లేదా వార్తల ప్రధానాంశాలులు చూసి ఈ నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడి నిర్ణయాలు జీవితకాలానికి తీసుకోబడతాయి, కాబట్టి ఈ ఎంపికలు చేయడానికి ముందు కొంత సమయం వెచ్చించడం తగిన పని.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను