ఏ వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం మరీ త్వరగా లేదా ఆలస్యంగా ఉందని మీరు భావిస్తున్నట్లయితే, వాస్తవానికి మీరు పెట్టుబడి పెట్టడానికి సరియైన వయసు మీరు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న ఈ క్షణమే అని నమ్మండి. కానీ మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత మంచిది ఎందుకంటే కాంపౌండింగ్ శక్తి ద్వారా దీర్ఘకాలంలో సంపదను సృష్టించడంలో మ్యూచువల్ ఫండ్లు సహాయపడతాయి.  

మీ పెట్టుబడులపై కాంపౌండింగ్ శక్తి తన మ్యాజిక్ చూపేందుకు, మీరు తప్పక మీ కెరీర్ ప్రారంభంలోనే మొదలు పెట్టాలి. వాస్తవానికి, మీరు సంపాదించడం ప్రారంభించిన రోజే మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి ప్రవేశించడానికి సరైన సమయం. మీరు మీ నెలవారీ సంపాదన నుండి కొంచం మిగిలించి, SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టగలిగితే, మీరు మీ డబ్బు పెరగడానికి కావల్సినంత ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారన్నమాట. అలాంటి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానంతో భవిష్యత్తులో అవసరాలు వచ్చినప్పుడు మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ రిస్క్ అపెటైట్కు సరిపోయే రిస్క్ స్థాయిలకు, అంటే రిస్క్ తీసుకునే మీ సామర్థ్యం మరియు సంసిద్ధతకు తగిన మ్యూచువల్ ఫండ్ స్కీములలో పెట్టుబడి పెట్టాలని గుర్తుంచుకోండి.

వయసు పెరిగే కొద్దీ, పెరుగుతున్న జీతాలతోపాటు మన జీవిత లక్ష్యాలు పెరుగుతాయి. మీ మొదటి జీతంతో SIP ద్వారా మీ పెట్టుబడి ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరియు ఈ పెరిగిన లక్ష్యాలను సులువుగా చేరుకోవడానికి ప్రతీ వేతన పెంపుతోపాటు దాన్ని పెంచండి. మీరు ఇంకా ప్రారంభించనప్పటికీ, మీ మ్యూచువల్ ఫండ్ ప్రయాణం ప్రారంభించడానికి ఈరోజు అనేది ఎప్పుడూ మరీ ఆలస్యం కాదు ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకోవడంలో మరికొన్ని సంవత్సరాలు ఆలస్యం చేసేదానికంటే కాంపౌండింగ్ శక్తి ఇప్పటికీ మీకు ఎంతోకొంత ఎక్కువ ఇవ్వగలదు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను