గ్రోత్ మరియు డివిడెండ్ ఎంపికల మధ్య తేడా ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

కొందరు పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో సంపదను సృష్టించాలనుకుంటారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లోకి ప్రవేశిస్తారు. వారు వారి కెరీర్ తొలినాళ్లలోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. అలాగే మరికొందరు రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న లేదా తమ జీవితంలోని రిటైర్మెంట్ దశలో ఇతర ఆదాయ వనరులకు అనుబంధంగా సంపాదన కోసం రిటైర్మెంట్ కార్పస్ను పెట్టుబడి పెట్టగల పెట్టుబడిదారులు ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండు భిన్నమైన పెట్టుబడి అవసరాలకు సరిపోయేటట్టు రెండు ఎంపికలను అందిస్తాయి. 

గ్రోత్ ఎంపిక అనేది భవిష్యత్ పెరుగుదల మరియు ఫండ్ విలువను పెంచడానికి ఫండ్ సంపాదించిన లాభాలను తన అంతర్లీన సెక్యూరిటీలలో తిరిగి పెట్టుబడి పెడుతుంది. గ్రోత్ ప్లాన్కు అధిక NAV ఉంటుంది ఎందుకంటే సెక్యూరిటీల నుండి వచ్చే లాభాలను ఈ స్కీములో తిరిగి పెట్టుబడి పెడుతుంది మరియు కాంపౌండింగ్ యొక్క శక్తి అప్పుడు పనిచేయడం మొదలు పెడుతుంది.

డివిడెండ్ ప్లాన్, ఫండ్ మేనేజర్ విచక్షణ ప్రకారం ఫండ్ ద్వారా వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు డివిడెండ్ రూపంలో పంచుతుంది. డివిడెండ్ చెల్లింపు, దానికి గ్యారంటీ లేకపోయినప్పటికీ, మీ ఆదాయానికి అనుబంధంగా సహాయపడగలదు. డివిడెండ్ ప్లాన్లో, పెట్టుబడిదారుడు ఒకవేళ డివిడెండ్ రీఇన్వెస్ట్ ఎంపికను ఎంచుకుంటే ఫండ్ యూనిట్లు పెరుగుతాయి, అయితే అతడు/ఆమె డివిడెండ్ చెల్లింపు ఎంచుకుంటే వారికి అదనపు ఆదాయం వస్తుంది.

01, ఏప్రిల్ 2020 నుండి, డివిడెండ్‌లకు పెట్టుబడిదారులు పన్ను చెల్లించాల్సి  ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్‌ల నుండి వచ్చిన డివిడెండ్ ఆదాయానికి వారి అత్యధిక ఆదాయపు పన్ను బ్రాకెట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

డివిడెండ్ ఆప్షన్ విషయంలో ఉన్న అదనపు పన్ను భారాన్ని మీరు విస్మరించ లేకపోయినా, ఒక అప్షన్ బదులుగా మరొకటి ఎంచుకునే నిర్ణయం ప్రధానంగా మీ ఆర్థిక లక్ష్యాలు/అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను