మ్యూచ్‌‌వల్ ఫండ్స్ పాస్‌బుక్‌ని జారీచేస్తాయా?

మ్యూచ్‌‌వల్ ఫండ్స్  పాస్‌బుక్‌ని జారీచేస్తాయా?
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

బ్యాంకులు మరియు నిర్దిష్ట చిన్నమొత్తాల పొదుపు పథకాలు పాస్‌బుక్‌ని జారీ చేస్తుండగా, మ్యూచ్‌‌వల్ ఫండ్స్ పాస్‌బుక్‌ని జారీ చేయవు, దానికి బదులుగా అకౌంట్ స్టేట్‌మెంట్‌ని జారీ చేస్తాయి. పాస్‌బుక్ ముఖ్య ఉద్దేశ్యం బ్యాంకుతో జరిపిన అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడం: డిపాజిట్, విత్‌డ్రాయల్స్, వడ్డీ క్రెడిట్ మొదలగునవి. మ్యూచ్‌‌వల్ ఫండ్ స్కీములో కూడా మూడూ ఉండవచ్చు: కొనుగోలు, రిడెంషన్లు, స్విచ్‌లు, డివిడెంట్ రీఇన్వెస్ట్‌‌మెంట్ మొదలగునవి. మ్యూచ్‌‌వల్ ఫండ్‌లో, అట్టి లావాదేవీలు అకౌంట్ స్టేట్‌మెంట్‌లో చేర్చబడతాయి.

ఒక స్కీములో ఇన్వెస్ట్మెంట్ చేసిన తరువాత ఒక అకౌంట్ స్టేట్మెంట్ జారీ చేయబడుతుంది. అకౌంట్ స్టేట్‌మెంట్‌లో అన్ని లావాదేవీలు కలిగి ఉంటాయి: ఇన్వెస్టర్‌పేరు, చిరునామా, జాయింట్ హోల్డింగ్, పెట్టుబడి మొత్తం, ఎన్ఎవి వివరాలు, కేటాయించిన యూనిట్లు మొదలగు వివరాలు. ప్రతి సారి కొత్త లావాదేవీ చేసినప్పుడు, అకౌంట్ స్టేట్‌మెంట్ అప్‌డేట్ చేయబడుతుంది మరియు నకలు ఇన్వెస్టర్‌కి మెయిల్ చేయబడుతుంది. ఈ డిజిటల్ యుగంలో, చాలా మంది ఇన్వెస్టర్‌లు ఇ-స్టేట్‌మెంట్ కోరుతున్నారు, ఇది సమాచారం చదివే, యాక్సెస్ చేసుకునే మరియు నిల్వ చేసేందుకు సౌకర్యవంతమైన మార్గం.

ఇన్వెస్టర్లు ఏ సమయంలోనైనా ఒక డూప్లికేట్ స్టేట్మెంటుని అసెట్ మేనేజిమెంట్ కంపెనీలు (ఎఎమ్సి) లేదా వారి రిజిస్ట్రార్లలను సంప్రదించి ప్రాప్యతను పొందవచ్చు మరియు వినియోగించుకోవచ్చు. స్కీము అకౌంట్ స్టేట్మెంట్ అలా పాస్బుక్ పాత్రని పోషిస్తుంది.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను