మీరు రిస్క్ తీసుకోగలిగిన కారణాన్ని బట్టి ఒక ఫండ్ను ఎంచుకోవడం ఎలా

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేటప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు గత పనితీరును చూస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి అది తప్పు పద్ధతి, ఎందుకంటే పనితీరు ఒక్కటే సంపూర్ణ చిత్రాన్ని ఇవ్వదు. రిటర్న్‌తో పాటు రిస్క్ కూడా ఉంటుంది. ఎక్కువ రిస్క్ ఉన్న ఫండ్ తక్కువ రిస్క్ ఉన్న ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వవచ్చు. పెట్టుబడి పెట్టిన పోర్ట్‌ఫోలియా రకం మీద ఆధారపడి ఫండ్‌ రిస్క్ ఉంటుంది. అయితే మనలో ప్రతి ఒక్కరు రిస్క్‌ను ఎంత సులువుగా తీసుకోగలరనేది మనం ఎంచుకునే ఫండ్‌ని నిర్ణయించాలి.

దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం, రిటైర్‌మెంట్ ప్లానింగ్ తీసుకుందాం. ఇది మనలో ప్రతి ఒక్కరికీ ఉమ్మడి గమ్యం అయినప్పటికీ, దీంట్లో కూడా ప్రతి ఒక్కరికీ వైవిధ్యత ఉంటుంది. మీరు కేవలం 30 సంవత్సరాల వయస్సులో మీ రిటైర్‌మెంట్ కార్పస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవచ్చు, అదే 52 సంవత్సరాల వయస్సున్న మీ అంకుల్ కూడా అదే లక్ష్యం కోసం పెట్టుబడి పెట్టవచ్చు. మీరు చాలా ఎక్కువ రిస్క్ తీసుకోగలరు, ఎందుకంటే మీ ముందు 25-30 సంవత్సరాలు ఉన్నాయి, కానీ మీ అంకుల్ కేవలం 8-10 సంవత్సరాలలోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అంకుల్ హైబ్రిడ్ ఫండ్ ఎంచుకుంటే, మీరు ఒక అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్ ఎంచుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం అంటే మనకు అంగీకారయోగ్యమైన రిస్క్ ఉన్నట్లు అనిపించే, మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం నిర్ణయించుకున్న కాల పరిధి లోపల మన లక్ష్యానికి తగినట్లు రిటర్న్ సామర్థ్యం ఉందనిపించే ఫండ్ కోసం వెతకడమే.

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను