డైరెక్ట్ ప్లాన్స్లో పెట్టుబడి పెట్టడం ఎలా

Video
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్ కొందరికి సులువుగా అనిపించవచ్చు, అదే మరికొందరికి వీటిని అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా అనిపించవచ్చు. ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా పని చేస్తుందో మరియు దానిలో ఏ రకమైన రిస్క్లు ఉన్నాయో కొత్త పెట్టుబడిదారులకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఈరోజు మార్కెట్లో వేలాది మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అలాంటి పెట్టుబడిదారులకు తమకు అత్యంత అనుకూలమైన కొన్ని ఫండ్స్ను ఎంచుకోవడం కష్టం అనిపించవచ్చు. 

అయినప్పటికీ, మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లాంటి మార్కెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే వివిధ పెట్టుబడి ఉత్పత్తుల గురించి బాగా తెలిసిన ఎందరో పెట్టుబడిదారులు ఉన్నారు. ఇలాంటి పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడంలో తగినంత అనుభవం ఉండటంగానీ లేదా ఆ విషయాన్ని వారు సవివరంగా అధ్యయనం చేసిగానీ ఉండవచ్చు. ఈ పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో, వాటి కేటగిరీలు మరియు సబ్కేటగిరీలు, ఈ ఫండ్స్లో ఉన్న రిస్క్-రిటర్న్ ట్రేడ్-ఆఫ్ మరియు వాటి పెట్టుబడి వ్యూహం గురించి మంచి అవగాహన ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి కొన్ని స్కీమ్స్ ఎంపిక చేయడానికి మరియు వారి పెట్టుబడులను పర్యవేక్షించడానికి వారు సొంత పరిశోధన చేయగలరు. ఇలాంటి పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడి పెట్టగలరు. వారికి తమ స్కీము ఎంపికను మేనేజ్ చేయడానికి ఆత్మవిశ్వాసం ఉంటుంది కాబట్టి వారు డైరెక్ట్ ప్లాన్స్లో పెట్టుబడి పెట్టడంలో అర్థం ఉంది మరియు రెగ్యులర్ ప్లాన్స్ కంటే డైరెక్ట్ ప్లాన్స్కు తక్కువ వ్యయ ఛార్జీలు ఉంటాయి.

డైరెక్ట్ ప్లాన్స్లో పెట్టుబడి పెట్టడానికి, అప్లికేషన్ ఇవ్వడానికి ఎవరైనా ఒక మ్యూచువల్ ఫండ్ కార్యాలయానికి వెళ్లవచ్చు లేదా దాని వెబ్సైట్లో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారులు ఒక మ్యూచువల్ ఫండ్ అగ్రెగేటర్ లేదా మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్ సైట్ ద్వారా డైరెక్ట్ ప్లాన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు.  అది రెగ్యులర్ ప్లాన్ అయినా లేక డైరెక్ట్ ప్లాన్ అయినా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం చాలా సులువు!

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను