కొత్త పన్ను విధానం కింద మీరు ELSS లో పెట్టుబడి పెట్టాలా?

కొత్త పన్ను విధానం కింద మీరు ELSS లో పెట్టుబడి పెట్టాలా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

1 ఏప్రిల్ 2020 నుండి అమలులోకి వచ్చిన కొత్త టాక్స్ విధానం వ్యక్తులు మరియు HUF పన్ను చెల్లింపుదారులు కొన్ని మినహాయింపులు వదులుకోవడం ద్వారా తక్కువ పన్ను రేట్లు మరియు మినహాయింపులు (పాత టాక్స్ విధానం) ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ పన్ను రేట్ల మధ్య ఎంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఈ కొత్త పన్ను విధానం అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. పన్ను చెల్లింపుదారులు నిర్ణయించుకోవడానికి పాత మరియు కొత్త రెండు విధానాలలో చేసిన పన్ను పొదుపును మూల్యాంకనం చేయాలి.

గృహ లేదా విద్యా రుణాలు, పన్ను మినహాయించిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, 15 లక్షల కంటే అధిక జీతం గలవారు లేదా మినహాయింపుల ద్వారా ఎక్కువ పొదుపు చేయగల పన్ను చెల్లింపుదారులకు పాత విధానం ఎక్కువ అనుకూలంగా ఉండవచ్చు. కాబట్టి ఈ పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలో పన్ను పొదుపు చేయడానికి ELSS లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. పాత పన్ను విధానంతో పోల్చినప్పుడు ఈ కొత్త విధానం సంవత్సరాంతంలో పెట్టుబడి రుజువులు సమర్పించే విషయంలో పేపరు పనిని చాలా వరకు ఖచ్చితంగా తగ్గిస్తుంది, కానీ పాత విధానం కూడా కొన్ని ముఖ్యమైన పెట్టుబడి మరియు పొదుపు నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. అది ELSS, పెన్షన్ ప్లాన్ లేదా PPF ఏదైనాగానీ ఏడాదికి ఈ పెట్టుబడులు లేదా పొదుపులు చేసేలా మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే ELSS లో SIP లను కలిగి ఉండవచ్చు. వారు తమ SIP లను ఆపివేయడానికి ముందు రెండు విధానాలలో పన్ను ప్రయోజనాన్ని మూల్యాంకనం చేయాలి.

పన్నులపై ఎక్కువ పొదుపు చేయడానికి ఏ పన్ను విధానం సహాయపడుతుంది అనేది పూర్తిగా మీ ఆదాయం మరియు జీతం నిర్మాణంపై ఆధారపడి ఉంటుందా? రెండు విధానాలలో మీరు మీ సొంతంగా మీ టాక్స్ చెల్లింపు బాధ్యతను లెక్కించలేకపోతే మీరు పన్ను సలహాదారున్ని సంప్రదించాలి. అలాంటి పోలిక పన్ను పొదుపులో సహాయపడటమే కాకుండా మీకు ఈక్విటీల పెరుగుదల సామర్థ్యాన్ని ఇచ్చే ELSS లో పెట్టుబడి పెట్టడాన్ని కొనసాగించడంలో మీ నిర్ణయానికి మార్గదర్శనం చేయగలదు. కొత్త విధానం మీకు బాగా అనుకూలం అయినప్పటికీ, సంపద సృష్టించే దృష్టితో మీరు ELSS లో పెట్టుబడి పెట్టడాన్ని ఇప్పటికీ పరిగణించవచ్చు. మార్కెట్లు ఒడిదుడుకులలో ఉన్నప్పుడు విత్‌డ్రా చేసేవారిలో మీరూ ఒకరు అయితే, లాక్-ఇన్ వ్యవధి స్వల్పకాలిక ఒడిదుడుకులలో నిలదొక్కుకోవడానికి మరియు అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ELSS ఫండ్స్‌కు 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉన్నందున, ఏకమొత్తం పెట్టుబడి పెట్టిన సందర్భంలో, మీరు ఈరోజు పెట్టుబడి పెడితే మీ డబ్బును మీరు 3 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకోగలరు. ప్రతీ SIP చెల్లింపుకు కూడా లాక్-ఇన్ పీరియడ్ వర్తిస్తుంది. 12 నెలలలో పెట్టిన పెట్టుబడి పూర్తి సొమ్ము మీరు విత్‌డ్రా చేయాలనుకుంటే, చివరి SIP ఇన్‌స్టాల్‌మెంట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు మీరు వేచి ఉండాలి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను