లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టడాన్ని ఎందుకు పరిగణించాలి?

లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టడాన్ని ఎందుకు పరిగణించాలి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

లార్జ్ క్యాప్ ఫండ్ తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా భారతదేశంలోని టాప్ 100 కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. మీరు ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీ డబ్బును ఫండ్ మేనేజర్లు చాలా పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రసిద్ధ కంపెనీలకు కేటాయిస్తారు. లార్జ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 80 శాతం పెట్టుబడులతో పెట్టుబడిదారులు బలమైన ఆర్థిక స్థితిగతులతో మార్కెట్ లీడింగ్, స్థిరమైన కంపెనీల్లో కొంత భాగాన్ని పరోక్షంగా సొంతం చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ కంపెనీల స్థిరత్వం మరియు బలంపై వృద్ధి చెందుతుంది. ఆర్థిక మాంద్యం నుంచి నావిగేట్ చేయడానికి కూడా ఈ కంపెనీలు బాగా సన్నద్ధమయ్యాయి. వారి దగ్గర బాగా స్థిరపడిన వ్యాపార నమూనాలు, దృఢమైన ఆర్థిక పునాదులు మరియు మార్కెట్ రిస్క్ؚలకు లోబడి దీర్ఘకాలంలో లాభాలను ఆర్జిస్తాయని నిరూపితమైన ట్రాక్ రికార్డులు ఉన్నాయి.


లార్జ్ క్యాప్ ఫండ్ؚలؚతో, పెట్టుబడిదారులు ప్రాథమికంగా బలమైన కంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి సరైన సమయాన్ని కనుగొనడం కోసం ఆందోళన చెందక్కర్లేదు. నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లు పెట్టుబడి ఎంపికలు చేస్తారు, ఇది మీకు సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది. కాబట్టి, లార్జ్-క్యాప్ ఫండ్ؚలో పెట్టుబడి పెట్టడం ఈ రెండు విధాలుగా లాభదాయకం: పెట్టుబడి మొత్తం తక్కువ మరియు నిపుణుల నిర్వహణ ఉంటుంది. మొత్తానికి, లార్జ్-క్యాప్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ రిస్క్ؚలకు లోబడి పిల్లల విద్య లేదా రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వంటి మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు సాపేక్షంగా స్థిరమైన మూలధన వృద్ధిని అందించవచ్చు.

డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

284
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను